కాకాణితో నేదురుమల్లి భేటీ | - | Sakshi
Sakshi News home page

కాకాణితో నేదురుమల్లి భేటీ

Aug 11 2026 11:58 PM | Updated on Aug 11 2026 11:58 PM

నెల్లూరురూరల్‌: వైఎస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని వెంకటగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. అనంతరం చిలకూరు మండల కన్వీనర్‌ యద్దల మధుసూదన్‌రెడ్డి, వేమారెడ్డి కుమారస్వామిరెడ్డి వారిని కలిసి గూడూరు నూతన నియోజకవర్గ ఇన్‌చార్జి బూదూరు గురవయ్య పరిచయ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈనెల 14న చిలకూరు మండలం మోమిడి గ్రామంలో జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి తప్పక హాజరవుతామని కాకాణి, నేదురుమల్లి తెలిపారు.

గాలివాన..

నేలవాలిన వరి పంట

వాకాడు: మండలంలో సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో చేతికందే దశలో ఉన్న వరి పంట నేలవాలింది. పలు ప్రాంతాల్లో పొలాల్లో నీరు చేరడంతో కోతకు సిద్ధంగా ఉన్న పంట నీటమునిగింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అనేక రోజులుగా పంటను కంటికి రెప్పలా కాపాడుకున్న అన్నదాతలకు వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. బలమైన ఈదురుగాలుల వల్ల గొల్లపాళెం, సవళ్ల, పులికాలవ, తెంగేళదిబ్బ, జీవుమానుదిబ్బ, నెల్లిపూడి, కల్లూరు, ముట్టెంబాక, కాశీపురం, కొండాపురం, జానరపేట, యరగాటిపల్లి తదితర గ్రామాల్లో వరి కంకులు నీట మునగడంతో దిగుబడి తగ్గే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కోతకు సిద్ధంగా ఉన్న పంట దెబ్బతినడంతో ధాన్యం మొలకెత్తే అవకాశం ముందని చెబుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించి నస్టాన్ని అంచనా వేయాలని, ప్రభుత్వం వెంటనే నష్టాన్ని గుర్తించి పరిహారం అందించాలని కోరుతున్నారు.

రెండు బైక్‌లు ఢీకొని ముగ్గురికి గాయాలు

ఆత్మకూరు: రెండు మోటార్‌బైక్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు గాయపడిన ఘటన మంగళవారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. మున్సిపల్‌ పరిధిలోని అల్లీపురం రోడ్డులో మోటార్‌బైక్‌పై జి.నరసింహులు, మరో వ్యక్తి కలిసి ఆత్మకూరుకు బయలుదేరారు. మరోవైపు ఎదురుగా బైక్‌పై పి.వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వస్తున్నాడు. ఈ రెండు బైక్‌లు ఢీకొన్నాయి. వీరంతా మద్యం మత్తులో ఉన్నారు. దీనికితోడు నరసింహులు బైక్‌లో రెండు ఫుల్లు బాటిళ్లున్నాయి. గాయపడిన ఆత్మకూరు 108 సిబ్బంది ఈఎంటీ అశోక్‌, పైలట్‌ మహేంద్ర ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement