నెల్లూరు(బృందావనం): నెల్లూరులోని పురమందిరం ప్రాంగణంలో ఏసీ హాల్లో సోమవారం ఆంధ్రప్రదేశ్ లైసెన్స్‌డ్ సర్వేయర్ల సర్వసభ్య సమావేశం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ముత్యంగౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రీసర్వే పనులకు లైసెన్స్‌డ్ సర్వేయర్లను వినియోగించుకోవాలన్నారు. గౌరవ వేతనం ఏర్పాటు చేయాలని, టీఏ, డీఏలు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షుడిగా దార్ల దయాకర్, ఉపాధ్యక్షుడిగా పొన్నపూడి తాతారావు, కార్యదర్శిగా బొడ్డు శ్రీహరి, ఎంకే జగదీషన్, కె.రమేష్, కోశాధికారిగా ఐవీ కృష్ణమోహన్, సాయి ప్రసూన, డివిజన్ల ప్రెసిడెంట్లుగా కె.విజయకుమార్, ఎస్‌కే మసూద్, ఎస్‌కే ఇమ్రాన్‌బాషా, మునిచంద్ర, కార్యవర్గ సభ్యులుగా సీహెచ్ కోటేశ్వరరావు, డి.శ్రీనివాసరావు, కె.రవికుమార్, జి.బ్లెస్సీ నియమితులయ్యారు.


