మా గ్రామంలో మాకు 2.38 సెంట్ల భూమి ఉంది. 80 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాం. మా వద్ద పాస్‌బుక్, వన్‌బీ అడంగళ్ ఉన్నాయి. అనుభవదారు కింద కూడా నమోదై ఉన్నాం. అయితే ఎనిమిది నెలల క్రితం జరిగిన రీసర్వేలో అధికారులు మా పొలాన్ని పెద్దమాలకొండయ్య పేరుపై రికార్డుల్లో నమోదు చేశారు. ఆయన ఆ పొలం తనది కాదని రాతపూర్వకంగా ఇచ్చారు. రికార్డులను సరిచేయాలని ఎనిమిది నెలలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కరించలేదు.
– కొల్లిబోయిన శ్రీనివాసులు,
సున్నంవారిచింతల, ఉదయగిరి మండలం


