ఎన్నికల హామీలెప్పుడు నెరవేరుస్తారు? | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల హామీలెప్పుడు నెరవేరుస్తారు?

Aug 10 2026 12:16 AM | Updated on Aug 10 2026 12:16 AM

‘చలో మెప్మా’ రేపు

ఐద్వా జిల్లా కార్యదర్శి మస్తాన్‌బీ

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తారని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా, నగర కార్యదర్శులు మస్తాన్‌బీ, కత్తి పద్మ ప్రశ్నించారు. నెల్లూరు బాలాజీ నగర్‌లోని డాక్టర్‌ రామచంద్రారెడ్డి భవన్‌లో ఐద్వా నగర రమిటీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పొదుపు మహిళల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 11వ తేదీన ‘చలో మెప్మా’ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. మెప్మా, బ్యాంక్‌ అధికారులు నెల్లూరు నగరంలో పొదుపు మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. బ్యాంక్‌ లింకేజీ రుణాలు ఇచ్చి అధిక వడ్డీలను బ్యాంక్‌లు వసూలు చేస్తున్నాయన్నారు. దీంతో అనేక మంది మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే ప్రతినెలా మహిళకు రూ.1,500 ఇస్తామని చెప్పారన్నారు. అదేవిధంగా నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు. అయితే ఇప్పటి వరకూ ఏ మహిళకు, నిరుద్యోగికి లబ్ధి చేకూర్చలేదన్నారు. ఓట్ల కోసం కూటమి నాయకులు అనేక హామీలు ఇచ్చారన్నారు. ‘చలో మెప్మా’ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో ఐద్వాకు చెందిన సుబ్బమ్మ, ఆదిల క్ష్మి, ముంజుమ్మ, భాగ్యమ్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement