● మీటర్ టెస్టింగ్ ల్యాబ్‌కు మంటల వ్యాప్తి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): నెల్లూరులోని ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా ప్రధాన కార్యాలయం విద్యుత్ భవన్ ప్రాంగణంలో పాత ఎంఆర్‌టీ భవనంలో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యుత్ సబ్‌స్టేషన్ల నుంచి మరమ్మతులకు గురైన, అధికంగా రీడింగ్ వస్తున మీటర్లను ఇక్కడికి తీసుకొస్తారు. వాటిని టెస్టింగ్ ల్యాబ్‌లో తనిఖీ చేస్తారు. మరమ్మతులకు గురైన వాటిని పునరుద్ధరిస్తారు. పూర్తిగా చెడిపోయిన మీటర్లను అక్కడే ఉంచుతారు. ఆదివారం ఈ ప్రదేశంలో అగ్నిప్రమాదం జరిగి మీటర్లు కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. కాగా అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.


