ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలి

Aug 9 2026 12:11 AM | Updated on Aug 9 2026 12:11 AM

నెల్లూరు(అర్బన్‌): ప్రభుత్వోద్యోగుల డిమాండ్లను పరిష్కరించడంలో విఫలమైతే ఉద్యమం చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్‌ పేర్కొన్నారు. నగరంలోని ఎన్జీఓ భవన్‌లో శనివారం నిర్వహించిన సంఘ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. డిమాండ్ల సాధన కోసం ఉద్యమ కార్యాచరణను ప్రకటించడంతో ప్రభుత్వం స్పందించి మంత్రుల కమిటీని పంపి తమతో చర్చించిందన్నారు. సీఎంతో మాట్లాడి పరిష్కరిస్తామని మంత్రులు హామీ ఇచ్చారని, తేడా వస్తే ఉద్యమాన్ని కచ్చితంగా చేపట్టి తమ సత్తా చూపుతామని తెలిపారు.

మెగా ఉచిత వైద్యశిబిరం

మహిళా ఉద్యోగుల కోసం కిమ్స్‌ హాస్పిటల్‌, రాష్ట్ర ఆయుష్‌ శాఖ, ఇతర ఆస్పత్రుల సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్యశిబిరాన్ని ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అలపర్తి విద్యాసాగర్‌, రమణ ప్రారంభించారు. సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బండారుపల్లి వెంకటేశ్వర్లు, గాదిరాజు రామకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్‌కుమార్‌, నిర్వహణ కార్యదర్శి లక్కాకుల పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనానికి

18 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శనివారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 18 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 75,533 మంది శుక్రవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 35,551 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.81 కోట్లను సమ ర్పించారు. టైమ్‌ స్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టిక్కెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement