● రోగి మృతిపై విచారణ
నెల్లూరు(అర్బన్): రెండు రోజుల క్రితం నగరంలోని గాంధీబొమ్మ సమీపంలో ఉన్న కేబీఆర్ ఆర్థోపెడిక్ ఆస్పత్రిలో ఓ రోగి కాలుకు కట్టు కట్టించుకుని గాయం మానేందుకు ఇంజెక్షన్ వేయించుకుంది. అయితే ఇంజెక్షన్ వేసిన 15 నిమిషాల్లోనే ఆమె అస్వస్థతకు గురై మరణించింది. దీంతో పేషెంట్ బంధువులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుజాత ఆదేశాల మేరకు వైద్యశాఖకు చెందిన ఎపిడిమియాలజిస్ట్ డాక్టర్ భాస్కర్, డీపీఎం సునీల్ శనివారం ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఆస్పత్రి అనుమతులు, డాక్టర్ల విద్యార్హతలు, వారు నిర్వహిస్తున్న రికార్డులు, మందులు తనిఖీ చేశారు. పేషెంట్‌కు చేసిన చికిత్స గురించి తెలుసుకున్నారు. పూర్తి వివరాలు జిల్లా వైద్యశాఖలో సమర్పించాల్సిందిగా ఆస్పత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు.


