నెల్లూరు(క్రైమ్): నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 15 మంది సిబ్బంది ఫోన్ ద్వారా తమ సమస్యలను తెలియజేశారు. ప్రధానంగా బదిలీలు, సస్పెన్షన్ రద్దు, ఇతర పరిపాలన అంశాలకు సంబంధించిన అభ్యర్థనలున్నాయి. పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాల్సిందిగా సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఏఓ చంద్రమౌళి, ఏఏఓ సావిత్రమ్మ, సూపరింటెండెంట్లు సురేష్, మస్తాన్‌రావు, ఎస్బీ – 2 ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


