భారీగా స్వాహా
● కుమ్మకై ్కన సర్పంచ్, కార్యదర్శులు
● రూ.రెండు కోట్ల ప్రజాధనం స్వాహా
● ఫండ్స్ దుర్వినియోగంపై విజిలెన్స్ విచారణ
● పచ్చ నేతల ఒత్తిడితో ఎంకై ్వరీలో జాప్యం
● పంచాయతీలో కొత్త విద్యుత్ లైన్ల ఏర్పాటు, బల్బ్‌ల కొనుగోలు పేరుతో దొంగ బిల్లులు పెట్టి, సర్పంచ్ సృజన భర్త సంధ్యారాయుడు అకౌంట్‌కు జమ చేశారనే ఆరోపణలున్నాయి.
● పంచాయతీలోని నేరేడుపల్లిలో గ్రామస్తుల విరాళాలతో వాటర్ ప్లాంట్ కోసం గదిని నిర్మిస్తే, దాన్ని పంచాయతీ నిధులతో చేసినట్లు చూపి రూ.4.8 లక్షలను కాజేశారు.
● పంచాయతీలో పాత మోటార్లకు రిపేరు చేసి, కొత్తవి కొనుగోలు చేసిన తరహాలో బిల్లులు రూపొందించి నిధులు డ్రా చేశారనే ఆరోపణలున్నాయి. పంచాయతీలో కొంతమంది బినామీ సిబ్బందిని పెట్టుకొని జీతాలను నెలనెలా బొక్కేశారని తెలుస్తోంది.
● పారిశుధ్య పనుల కోసం బ్లీచింగ్, సున్నం కొనుగోలు చేసినట్లు పంచాయతీ కార్యాలయ సిబ్బంది పేరుతో బిల్లులు పెట్టి స్వాహా చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి
● పంచాయతీ నిధులతో సిమెంట్ రోడ్లను నాసిరకంగా నిర్మించి నిబంధనలకు విదర్ధుంగా సర్పంచ్ భర్తపై డ్రా చేశారు.
● వాస్తవానికి నిధుల ఖర్చుకు సంబంధించి రూ.20 వేలు దాటితే ఓచర్‌కు బదులు ఎం బుక్‌లో రికార్డు చేసి డ్రా చేయాల్సి ఉంది. అయితే ఓచర్ల పేరుతో రూ.లక్షల మేర డ్రా చేసి.. కంప్యూటర్ ఆపరేటర్, స్వీపర్ల ఖాతాల్లో జమ చేశారు.
వింజమూరు(ఉదయగిరి): వింజమూరు మేజర్ పంచాయతీలో రూ.కోట్ల ప్రజాధనాన్ని స్వాహా చేశారు. మాజీ సర్పంచ్ నల్లగొండ్ల సృజన, పలువురు పంచాయతీ కార్యదర్శులు కుమ్మకై నిబంధనలకు విరుద్ధంగా ఇలా వ్యవహరించారు. ఇంత జరుగుతున్నా, సంబంఽధిత అధికారులు పట్టించుకోలేదు. భారీ మొత్తంలో నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్‌కు ఓ ఎంపీటీసీ ఫిర్యాదు చేశారు. దీంతో విచారణను అధికారులు చేపట్టారు. అయితే పచ్చ నేతల ఒత్తిడితో ఎంకై ్వరీలో జాప్యం జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఏటా ఇలా..
వింజమూరు మేజర్ పంచాయతీలో 25 వేల వరకు జనాభా ఉంది. జనరల్ ఫండ్, ఆర్థిక సంఘ నిధుల రూపంలో ఏటా రూ.కోటి వరకు వస్తోంది. ఇదే కాకుండా ఇతర మార్గాల ద్వారా సైతం మరికొంత ఆదాయమొస్తోంది. ఈ క్రమంలో 2022 నుంచి 2026 ఆర్థిక సంవత్సరం వరకు నిధులు భారీగా పక్కదారి పట్టాయి.
తూతూమంత్రంగా..
నిధుల దుర్వినియోగంపై కలెక్టర్‌కు వింజమూరు సెగ్మెంట్ – 6కు చెందిన ఎంపీటీసీ యాకసిరి భవాని ఏడాది క్రితమే ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ నిమిత్తం కావలి డీఎల్పీఓను నియమించి నివేదికివ్వాలని ఆదేశించారు. అయితే అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో విచారణలో జాప్యం చేశారు. దీంతో విజిలెన్స్ ఆఫీసర్లకు ఆమె ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఎంకై ్వరీ సాగుతున్నా, పచ్చ నేతలు ఒత్తిడి తెచ్చి తూతూమంత్రంగా క్లోజ్ చేసి చేతులు దులుపుకొనేందుకు యత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పేరుకే షోకాజ్ నోటీస్
పంచాయతీ నిధులు దుర్వినియోగమయ్యాయని, దీనికి సమాధానమివ్వాలని కోరుతూ సర్పంచ్ సృజనకు షోకాజ్ నోటీస్‌ను మార్చిలో కావలి డీఎల్పీఓ జారీ చేశారు. అయితే ఇది ఏమైందో నేటికీ తెలియదు. అధికారులు గోప్యంగా ఉంచారనే ఆరోపణలూ లేకపోలేదు. నిధులను దుర్వినియోగం చేసిన వారిపై క్రిమినల్ కేసులను నమోదు చేయాల్సి ఉన్నా, అలాంటివేవీ నేటికీ జరగలేదు. ప్రాథమిక సమాచారం మేరకు పంచాయతీలో రూ.1.54 కోట్ల మేర నిధులు పక్కదారి పట్టాయని తెలుస్తోంది. విచారణను పారదర్శకంగా జరిపితే ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆఫీసర్లు ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాల్సి ఉంది.
రికార్డులను పరిశీలిస్తున్న విజిలెన్స్ అధికారులు
వింజమూరు పంచాయతీ కార్యాలయం
విచారణ చేస్తున్నాం
పంచాయతీ నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నాం. ఇవి పక్కదారి పట్టాయనే అంశాన్ని గుర్తించాం. అన్ని రికార్డులు, వాటి అధారంగా పనులను పరిశీలించాం. ఉన్నతాధికారులకు నివేదికను త్వరలో అందజేయనున్నాం.
– వేణుగోపాల్, విజిలెన్స్ అధికారి


