నేత్రపర్వంగా శ్రీవారి కల్యాణం
రాపూరు: మండలంలోని పెంచలకోన క్షేత్రంలో పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా శనివారం నిర్వహించారు. అభిషేకం, సుప్రభాతం, గోపూజ, పూలంగిసేవను జరిపారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను నిత్య కల్యాణ మండపంలో కొలువుదీర్చి వివిధ రకాల ఆభరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ కల్యాణాన్ని నిర్వహించారు. ఊజంల్‌సేవను సాయంత్రం జరిపారు. నిత్యాన్నదాన పథకానికి రూ.రెండు లక్షల విరాళాన్ని నెల్లూరులోని జెడ్పీ కాలనీకి చెందిన మలిశెట్టి పాపయ్య అందజేశారని దేవస్థాన ఏసీ శ్రీనివాసులు తెలిపారు.
చాగంటికి ఘన స్వాగతం
నెల్లూరు(బారకాసు): ఆదిశంకరాచార్య కృత జగన్నాథాష్టకంపై ఆధ్యాత్మిక దివ్య ప్రవచనలకు ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు శనివారం హాజరయ్యారు. పురమందిర ప్రాంగణంలోని ఓపెన్ ఆడిటోరియంలో భరద్వాజ రుద్రాభిషేక సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. సంఘ కార్యదర్శి యజ్ఞమూర్తి బాలసుబ్రహ్మణ్యం తదితరులు పర్యవేక్షించారు.
నేత్రపర్వంగా శ్రీవారి కల్యాణం


