హ్యాండ్‌బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): హ్యాండ్‌బాల్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఆదివారం ఎన్నుకున్నారు. నగరంలోని ఏసీ స్టేడియంలో హ్యాండ్‌బాల్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. అధ్యక్షుడిగా హరిచంద్రారెడ్డి, కార్యదర్శిగా అజయ్‌కుమార్, కోశాధికారిగా జితేంద్ర ఎన్నికయ్యారు. సమావేశానికి చైర్మన్‌గా రవీంద్రబాబు, రిటర్నింగ్ అధికారిగా న్యాయవాది రంగరాజన్ వ్యవహరించారు. వెంకటేశ్వరరావు, డీఎస్డీఓ యతిరాజ్, జిల్లా ఒలింపిక్ సంఘ ప్రతినిధి అరిగెల విజయకుమార్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు గాదం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
వీఆర్‌ఏల మహాసభల జయప్రదానికి పిలుపు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లిలో జూన్ ఆరున నిర్వహించనున్న వీఆర్‌ఏల రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని వీఆర్‌ఏల సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బందగీ సాహెబ్ పిలుపునిచ్చారు. నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన వీఆర్‌ఏల జిల్లా కమిటీ సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించనున్నామని వెల్లడించారు. వివిధ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భాస్కర్, పెంచలనరసయ్య, లచ్చయ్య, సుబ్బయ్య, ఓబులేసు, షమీమ్, సీతమ్మ, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
రీవాల్యుయేషన్లో
పెరిగిన మార్కులు
ఆత్మకూరు: పదో తరగతిలో ఆశించిన మార్కులు రాకపోవడంతో నిరాశకు గురైన విద్యార్థి రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక మార్కులు పెరగడంతో విద్యార్థి ఆనందానికి అవధుల్లేకుండాపోయింది. వివరాలు.. పట్టణంలోని చైతన్య పాఠశాల విద్యార్థిని మేఘనకు ఫలితాల్లో 590 మార్కులే వచ్చాయి. ఈ క్రమంలో రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోగా, ఇది 598కు పెరిగింది. ఆత్మకూరు చరిత్రలో ఈ స్థాయిలో మార్కులు సాధించిన తొలి విద్యార్థిగా నిలిచింది. దీంతో పాఠశాలలో ఆమెను ఆదివారం అభినందించారు. పాఠశాల జీఎం కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పొదలకూరు
నిమ్మ ధరలు
పెద్దవి: రూ.50
సన్నవి: రూ.25
పండ్లు: రూ.15
నెల్లూరు పౌల్ట్రీ
అసోసియేషన్ ధరలు
బ్రాయిలర్: రూ.127
లేయర్ రూ.110
బ్రాయిలర్ చికెన్: రూ.230
స్కిన్‌లెస్ చికెన్: రూ.254
లేయర్ చికెన్: రూ.187
హ్యాండ్‌బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక
హ్యాండ్‌బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక


