నెల్లూరులో నిర్వహించిన జాబ్‌మేళాకు హాజరైన నిరుద్యోగులు (ఫైల్)
నైపుణ్య శిక్షణతో ఉద్యోగావకాశాలు
స్థానిక యువతకు స్థానికంగా ఉండే పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించాలన్న ప్రభుత్వ ఆదేశాలు మేరకు ఉమ్మడి జిల్లాలోని శ్రీసిటిలో పరిశ్రమల ఆధారిత నైపుణ్య శిక్షణ, ఉపాధి శిక్షణలు ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తున్నాం. ప్రత్యేకంగా జాబ్‌మేళాలు నిర్వహించి ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం. నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ప్రత్యేకంగా శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తున్నాం.
– కట్టమంచి విజయ వినీల్‌కుమార్,
నైపుణ్య శిక్షణ అధికారి, నెల్లూరు
ఉద్యోగ కల్పన నా బాధ్యత
ఆత్మకూరు ప్రజలు నన్ను ఆదరించి అక్కున చేర్చుకున్నారు. వారికి అన్ని విధాలా సాయం చేయడం నా ధర్మం. ఆత్మకూరు, ఉదయగిరి మెట్టప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించి వారిపై తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను నెరవేర్చాలనుకున్నా. పరిశ్రమల ఆధారిత నైపుణ్య శిక్షణలు ఇచ్చి వారికి కొలువులు అందేలా చేస్తున్నాం. ఇటీవల సెంచూరియన్ కంపెనీ యాజమాన్యంతో మాట్లాడగా 500 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు అంగీకరించారు.
–మేకపాటి విక్రమ్‌రెడ్డి, ఎమ్మెల్యే, ఆత్మకూరు


