
సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రూమర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్జే మహ్వాష్ క్రీడా రంగంలోకి అడుగుపెట్టింది. ఓ క్రికెట్ జట్టుకు ఆమె ఇప్పుడు యజమాని అయ్యారు. ఛాంపియన్స్ లీగ్ టీ10 టోర్నీలో ఒక జట్టు సహ-యజమానిగా ఆమె వాటా కొనుగోలు చేసింది.
ఈ విషయాన్ని మహ్వాష్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది. అయితే జట్టు పేరును మాత్రం ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.
కాగా తొట్టతొలి ఛాంపియన్స్ లీగ్ టీ10 ఎడిషన్ ఆగస్టు 22 నుండి 24 వరకు ఢిల్లీ వేదికగా జరుగుతుంది. ఈ లీగ్ కమిషనర్ భారత మాజీ క్రికెటర్ చేతన్ శర్మ వ్యవహరించనున్నాడు. ఇందులో ఎలైట్ ఈగల్స్, మైటీ మావెరిక్స్, సూపర్ సోనిక్, డైనమిక్ డైనమోస్, బ్రేవ్ బ్లేజర్స్, విక్టరీ వాన్‌గార్డ్, స్టెల్లార్ స్ట్రైకర్స్ , సుప్రీం స్టాలియన్స్ మొత్తం ఎనిమిది జట్లు పాల్గోనున్నాయి.
ఈ టోర్నీలో భారత మాజీ క్రికెటర్లతో పాటు వివిధ వృత్తులకు చెందిన ప్రముఖులు భాగం కానున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా లోకల్ యంగ్ టాలెంట్‌కు దిగ్గజ ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం కల్పించినట్లు సమాచారం. ఈ లీగ్‌కు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించే అవకాశముంది. ఇక ఇది ఇలా ఉండగా.. చాహల్, ఆర్జే మహ్వాష్ గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ ఏదో ఒక విషయంతో తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు.
చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో మూడో టెస్టు.. 95 ఏళ్ల వరల్డ్ రికార్డుపై గిల్ గురి