‘యూట్యూబర్‌’తో చహల్‌ టిక్‌టాక్‌! | Yuzvendra Chahal Will Marry Youtube Star Dhanashree Varma | Sakshi
Sakshi News home page

‘యూట్యూబర్‌’తో చహల్‌ టిక్‌టాక్‌!

Aug 9 2020 3:11 AM | Updated on Aug 9 2020 9:48 AM

Yuzvendra Chahal Will Marry Youtube Star Dhanashree Varma - Sakshi

భారత క్రికెట్‌ జట్టు లెగ్‌స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ త్వరలో ఒక ఇంటివాడు కానున్నాడు. డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్‌ అయిన ధనశ్రీ వర్మతో అతని నిశ్చితార్ధం జరిగింది. సోషల్‌ మీడియా ద్వారానే వీరిద్దరికి పరిచయం ఏర్పడినట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు తమ వివాహానికి ఆమోదం తెలిపినట్లు చహల్‌ వెల్లడించాడు. టీమిండియా ఆటగాడైన చహల్‌ తరచుగా పోస్ట్‌ చేసే టిక్‌టిక్‌ వీడియోలకు పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. యూ ట్యూబర్, కొరియా గ్రాఫర్‌ కూడా అయిన ధనశ్రీ తన పేరుతోనే ఒక కంపెనీ నెలకొల్పి తన వీడియోలు అందులో పెడుతుంటుంది. ఇదే క్రమంలో చహల్‌కు కూడా డ్యాన్స్‌ నేర్పినట్లు ఇటీవల ఒక పోస్ట్‌ చేసింది కూడా. భారత్‌ తరఫున 52 వన్డేలు, 42 టి20లు ఆడిన చహల్‌ ఆర్‌సీబీ జట్టు తరఫున త్వరలోనే ఐపీఎల్‌ బరిలోకి దిగనున్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement