
కాలిఫోర్నియా: ఇండియన్ వెల్స్ మాస్టర్స్–1000 టెన్నిస్ టోర్నీలో భారత డబుల్స్ స్టార్ యూకీ బాంబ్రీ పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో యూకీ బాంబ్రీ (భారత్)–ఆండ్రీ గొరాన్సన్ (స్వీడన్) ద్వయం 6–7 (5/7), 6–3, 8–10తో ‘సూపర్ టైబ్రేక్’లో ఫెర్నాండో రాంబోలి (బ్రెజిల్)–జాన్ ప్యాట్రిక్ స్మిత్ (ఆస్ట్రేలియా) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది.
1 గంట 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ–గొరాన్సన్ ఏడు ఏస్‌లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశారు. యూకీ–గొరాన్సన్‌లకు 65 వేల డాలర్ల (రూ. 56 లక్షల 67 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 180 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. కెరీర్‌లో తొలిసారి మాస్టర్స్ సిరీస్ టోర్నీలో ఆడిన యూకీ తాజా ప్రదర్శనతో రెండు స్థానాలు మెరుగుపర్చుకొని 37వ ర్యాంక్‌కు చేరుకుంటాడు.
Comments
Please login to add a commentAdd a comment