
న్యూఢిల్లీ: ఈ సీజన్ ఐపీఎల్‌తో హైదరాబాద్ యువ క్రికెటర్ నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ చాన్స్ మీద చాన్స్ కొట్టేస్తున్నాడు. తొలుత న్యూజిలాండ్ ‘ఎ’తో 3 మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌కు ఎంపికైన అతన్ని తాజాగా న్యూజిలాండ్ ‘ఎ’తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కూ కొనసాగిస్తున్నారు. ఆంధ్ర వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ కూడా ఈ జట్టులో ఉన్నాడు. కెప్టెన్‌గా సంజూ సామ్సన్ వ్యవహరిస్తాడు. చెన్నై వేదికగా ఈ మూడు వన్డేలు ఈనెల 22, 25, 27 తేదీల్లో జరుగుతాయి.
భారత్ ‘ఎ’ వన్డే జట్టు: సంజూ సామ్సన్ (కెప్టెన్), పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, రజత్ పటిదార్, తిలక్ వర్మ, శ్రీకర్ భరత్, కుల్దీప్ యాదవ్, కుల్దీప్ సేన్, శార్దుల్ ఠాకూర్, ఉమ్రాన్ మలిక్, నవ్‌దీప్ సైనీ, రాజ్ అంగద్, రాహుల్ చహర్, షహబాజ్ అహ్మద్.