World Test Championship: పాకిస్తాన్‌కు ఊహించని షాక్‌.. ఫైనల్‌ అవకాశాలు సంక్లిష్టం! మరి టీమిండియా పరిస్థితి?

WTC: Pakistan Hopes In Jeopardy After Loss India Chances Boosted - Sakshi

ICC World Test Championship 2021 - 2023 Updated Points Table: బ్యాటింగ్‌ అనుకూల పిచ్‌పై పరుగుల వరద పారించిన ఇంగ్లండ్‌ సరైన సమయంలో వికెట్లు కూల్చి పాకిస్తాన్‌కు కోలుకోలేని షాకిచ్చింది. వరల్డ్‌టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) 2021-23 ఫైనల్‌ చేరాలని ఉవ్విళ్లూరుతున్న బాబర్‌ ఆజం బృందం అవకాశాలను సంక్లిష్టం చేసింది. అదే విధంగా టీమిండియా అభిమానులకు గుడ్‌న్యూస్‌ అందించింది.  

కాగా దాదాపు 17 ఏళ్ల తర్వాత పాక్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ ఆడుతున్న ఇంగ్లిష్‌ జట్టు.. ఫలితం తేలదనుకున్న మొదటి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రావల్పిండి మ్యాచ్‌లో బెన్‌ స్టోక్స్‌ బృందం పాక్‌ను ఏకంగా 74 పరుగుల తేడాతో మట్టికరిపించింది.

పాక్‌ అవ​కాశాలు సంక్లిష్టం..
డబ్ల్యూటీసీ ప్రస్తుత సీజన్‌లో భాగంగా పాక్‌ ఈ సిరీస్‌ ఆరంభానికి ముందు పాయింట్ల పట్టికలో పాకిస్తాన్‌ ఐదో స్థానంలో ఉంది. ఈ భారీ ఓటమి తర్వాత కూడా పాక్‌ అదే స్థానంలో ఉన్నప్పటికీ ఆస్ట్రేలియా, టీమిండియాతో విజయశాతాలతో పోలిస్తే మరింత వెనుకబడింది. దీంతో ఫైనల్‌ చేరాలంటే మిగిలిన మ్యాచ్‌లలో తప్పక గెలవడం సహా ఇతర జట్ల తాజా సిరీస్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

ఎలాగంటే...
స్వదేశంలో వెస్టిండీస్‌పై తొలి టెస్టులో గెలుపుతో ఆస్ట్రేలియా విజయాల సంఖ్య 7కు చేరింది. ఈ క్రమంలో 96 పాయింట్లతో ఆసీస్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక ఈ సీజన్‌లో వెస్టిండీస్‌తో మరొకటి, దక్షిణాఫ్రికాతో మూడు.. ఇండియా పర్యటనలో నాలుగు టెస్టులు ఆడాల్సి ఉంది. 

వీటిలో భారత్‌తో ఆడే సిరీస్‌ ఆస్ట్రేలియాకు అత్యంత కీలకం. టీమిండియాతో సిరీస్‌లో మంచి ఫలితాలు సాధిస్తే గనుక డబ్ల్యూటీసీ ఫైనల్‌కు తొలిసారి అర్హత సాధించే అవకాశం ఆస్ట్రేలియాకు దక్కుతుంది.

టీమిండియా నాలుగో స్థానంలో ఉన్నా..
ఈ డబ్ల్యూటీసీ సీజన్లో టీమిండియాకు మిగిలి ఉన్న టెస్టులు ఆరు. బంగ్లాదేశ్‌ పర్యటనలో రెండు.. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టులు ఆడేలా రోహిత్‌ సేన షెడ్యూల్‌ ఖరారైంది. ఇక స్వదేశంలో ఇండియాకు ఆస్ట్రేలియా మీద ఉన్న రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బంగ్లాదేశ్‌పై కూడా భారత్‌కు మెరుగైన రికార్డే ఉంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం నాలుగో ప్లేస్‌లో ఉన్న టీమిండియా(52.08 శాతం) ఆరింటికి ఆరు గెలిస్తే  రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా(72 పాయింట్లు) , శ్రీలంక (64) వెనక్కి నెట్టి టాప్‌-2కు చేరుకుంటుంది. కాగా పాయింట్ల పరంగా ఈ రెండు జట్ల కంటే భారత్‌ మెరుగైన స్థితిలో ఉంది.

అంతేకాదు.. దక్షిణాఫ్రికాకు ఈ సీజన్‌లో మిగిలి ఉన్న టెస్టులు ఐదు. సఫారీ జట్టు ఆస్ట్రేలియా గడ్డ మీద మూడు, వెస్టిండీస్‌తో స్వదేశంలో రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. అయితే ఆసీస్‌ గడ్డ మీద గనుక సౌతాఫ్రికాకు విజయం అంత సులభమేమీ కాదు. మరోవైపు.. ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై ఆడనుండటం టీమిండియాకు సానుకూల అంశంగా ఉంది.

ఇక శ్రీలంక విషయానికొస్తే.. 
డబ్ల్యూటీసీ తాజా సీజన్‌లో శ్రీలంకకు మిలిగి ఉన్న టెస్టులు రెండు మాత్రమే. ఇందుకోసం లంక న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కానీ కివీస్‌ గడ్డపై లంక రికార్డు చెత్తగా ఉంది. అక్కడ శ్రీలంక 19 మ్యాచ్‌లు ఆడితే గెలిచింది రెండు మాత్రమే! ఒకవేళ కివీస్‌ టూర్‌లో చేదు అనుభవం ఎదురైతే లంక టాప్‌-2కు చేరడం దాదాపు అసాధ్యం.

పాక్‌కు మిగిలి ఉన్నవి?
తొలి టెస్టులో ఇంగ్లండ్‌ చేతిలో ఓడిన పాకిస్తాన్‌కు మిగిలి ఉన్న టెస్టులు నాలుగు. ఇంగ్లండ్‌తో రెండు, న్యూజిలాండ్‌తో మూడు. ఇప్పటి వరకు ఆడిన 10 టెస్టుల్లో 4 నాలుగు మాత్రమే గెలిచిన పాకిస్తాన్‌...  4 ఓడి, రెండు డ్రా చేసుకుంది. కాబట్టి ప్రస్తుతం 56 పాయింట్లతో ఉన్న పాక్‌(46.67 శాతం).. ముందుకు సాగాలంటే ఆస్ట్రేలియా, టీమిండియా మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. మిగిలిన జట్ల వివరాలు పట్టికలో చూడవచ్చు.

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక(PC: ICC)

చదవండి: Ind Vs Ban: చెత్త బ్యాటింగ్‌.. రోహిత్‌ ఇకనైనా మారు! అతడిని అన్ని మ్యాచ్‌లలో ఆడించాలి: మాజీ క్రికెటర్‌
IND Vs Ban ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు ఐసీసీ షాక్‌

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top