WTC Final 2023: భారత క్రికెట్‌ అభిమానులకు శుభవార్త

WTC Final 2023 Between India And Australia Will Be Live On DD Sports - Sakshi

భారత క్రికెట్‌ అభిమానులకు శుభవార్త. భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఓవల్‌ వేదికగా జూన్‌ 7-12 మధ్యలో జరిగే వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2021-23 ఫైనల్‌ మ్యాచ్‌ను డీడీ స్పోర్ట్స్‌ (డీడీ ఫ్రీ డిష్‌) ఛానెల్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని దూరదర్శన్‌ స్పోర్ట్స్‌ ఇవాళ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. ‌దేశవ్యాప్తంగా ఉన్న​ క్రికెట్‌ అభిమానులు తాము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌ డీడీ స్పోర్ట్స్‌లో ఫ్రీగా ప్రత్యక్ష ప్రసారం అవుతుందని తెలిసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం భారత్‌, ఆస్ట్రేలియా జట్లు ఇదివరకే మ్యాచ్‌ వేదిక అయిన ఓవల్‌ మైదానానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలుపొందాలని ఇరు జట్లు కఠోరంగా శ్రమిస్తున్నాయి. బలాబలాల వరకు ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తుండటంతో ఈ మ్యాచ్‌ రసవత్తరంగా సాగనుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. 

అస్ట్రేలియా: మార్కస్‌ హ్యారిస్‌, ఉస్మాన్‌ ఖ్వాజా, డేవిడ్‌ వార్నర్‌, ట్రవిస్‌ హెడ్‌, స్టీవ్‌ స్మిత్‌, మార్నస్‌ లబూషేన్‌, కెమరూన్‌ గ్రీన్‌, అలెక్స్‌ క్యారీ, జోష్‌ ఇంగ్లిస్‌, పాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), స్కాట్‌ బోలాండ్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, మిచెల్‌ స్టార్క్‌, టాడ్‌ మర్ఫీ, నాథన్‌ లయోన్‌

టీమిండియా: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, పుజారా, విరాట్‌ కోహ్లి, అజింక్య రహానే, అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, రవీంద్ర జడేజా, శ్రీకర్‌ భరత్‌, ఇషాన్‌ కిషన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, జయదేవ్‌ ఉనద్కత్‌

చదవండి: WTC Final 2021-23: ఎక్కడా మన వాళ్లు టాప్‌లో లేరు.. అయినా ఫైనల్‌కు..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top