IND vs SA: 'టీ20 ప్రపంచకప్‌ నా టార్గెట్‌.. అందుకు ఇదే సరైన వేదిక'

World Cup is the goal but this is the right platform to prepare for it Says Hardhik Pandya - Sakshi

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌ తనకు ఎంతో కీలకమని భారత స్టార్‌ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అన్నాడు. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు సన్నద్ధమయ్యేందుకు ఇదే సరైన సమయం అని పాండ్యా తెలిపాడు. గాయం కారణంగా గత కొంత కాలంగా భారత జట్టుకు దూరమైన హార్ధిక్‌ పాండ్యా.. దక్షిణాఫ్రికా సిరీస్‌తో తిరిగి జట్టులోకి వచ్చాడు.

ఈ సిరీస్‌లో టీమిండియా వైస్‌ కెప్టెన్‌గా హార్దిక్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇక ఐపీఎల్‌-2022లో గుజరాత్‌ టైటాన్స్‌కు సారథ్యం వహించిన హార్ధిక్‌.. అరంగేట్రంలో తమ జట్టును ఛాంపియన్స్‌గా నిలిపాడు. ఇక ఈ ఐపీఎల్‌ సీజన్‌లో పాండ్యా ఆల్‌రౌండర్‌గా అద్బుతమైన ప్రదర్శన చేశాడు. పాండ్యా 487 పరుగులతో పాటు 8 వికెట్లు కూడా పడగొట్టాడు.

"నేను చాలా సంతోషంగా ఉన్నాను. దేశం తరపున ఆడడం నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. సుదీర్ఘ విరామం తర్వాత జట్టలోకి వచ్చాను. నేను ఎంటో నిరూపించుకోవడానికి నాకు మరో అవకాశం లబించింది. నేను ఆడే ప్రతీ సిరీస్‌, ప్రతీ మ్యాచ్‌ నాకు చాలా ముఖ్యం. నా లక్ష్యం టీ20 ప్రపంచకప్‌. కాబట్టి అందుకు సిద్దం కావడానికి ఇదే సరైన వేదిక.

మళ్లీ క్రికెట్‌ సమరం రాబోతోంది. నేను నా రిథమ్‌ను కొనసాగించాలి అనుకుంటున్నాను. నన్ను నేను నిరూపించుకోవడానికి ఈ సిరీస్ నాకు గొప్ప అవకాశం. ఈ సిరీస్‌లో నా పాత్రలు మరాయి. నేను కెప్టెన్‌కు కాను, బ్యాటింగ్‌లో ముందుగా రాను. మళ్లీ మీకు తెలిసిన హార్దిక్‌గా తిరిగి వచ్చాను" అని హార్ధిక్‌ పాండ్యా పేర్కొన్నాడు.
చదవండి: Hardik Pandya: ఎన్నెని మాటలు అన్నారో.. అదో పెద్ద యుద్ధం.. ఎన్ని త్యాగాలు చేశానో ఎవరికీ తెలియదు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top