
నేటి నుంచి మహిళల ప్రొ హాకీ లీగ్
లండన్: మహిళల హాకీ ప్రొ లీగ్ యూరోపియన్ అంచె పోటీల కోసం భారత జట్టు పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. లోటుపాట్లను సవరించుకొని ఆస్ట్రేలియాను ‘ఢీ’కొట్టేందుకు రెడీ అయ్యింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ప్రొ లీగ్‌లో 9 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్న భారత మహిళల జట్టు పట్టికలో ఎగబాకేందుకు యూరోప్ అంచెను సది్వనియోగం చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా మహిళల టీమ్ నేడు, రేపు వరుస మ్యాచ్‌ల్లో ఆసీస్‌తో తలపడుతుంది.
ప్రస్తుత జట్టు యువ క్రీడాకారిణిలతో పాటు అనుభవజు్ఞల కలబోతతో సమతూకంగా ఉంది. యూరోప్ పర్యటనతో రాటుదేలాక సెపె్టంబర్‌లో జరిగే ఆసియా చాంపియన్‌షిప్ టైటిల్‌తో నేరుగా వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌కు అర్హత సాధించాలని మహిళల జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. గట్టి ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు దీటుగానే సిద్ధమయ్యామని చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్ అన్నారు. ‘ప్రతి విభాగం కూడా పటిష్టమయ్యేందుకు సమష్టిగా శ్రమించాం.
అయితే రెండు విభాగాల్లో మరింత దృష్టి సారించాల్సి వచ్చింది. ఫలితాన్ని తారుమారు చేసే గోల్ కీపింగ్, డ్రాగ్ ఫ్లికింగ్ విభాగాలు అంత్యంత కీలకం’ అని కోచ్ అన్నారు. ఇందులో భాగంగానే డ్రాగ్‌ఫ్లికర్లు దీపిక, మనీషాలకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. యూరోప్ టూర్‌కు ముందే డ్రాగ్ ఫ్లిక్‌లో నిపుణుడైన నెదర్లాండ్స్ కోచ్ టూన్ సీప్‌మన్‌తో పది రోజుల పాటు ఇద్దరు శిక్షణ తీసుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా పేరొందిన డ్రాగ్ ఫ్లికర్లలో చాలా మంది సీప్‌మన్ శిష్యులే అని ఈ సందర్భంగా హరేంద్ర సింగ్ చెప్పుకొచ్చారు. ఇలా ప్రతి విభాగంలోనూ క్రీడాకారిణిలను దీటుగా తయారు చేస్తున్నామని చెప్పారు. భారత్ అంచె పోటీల్లో ప్రపంచ నంబర్‌వన్ నెదర్లాండ్స్‌ను 2–2తో భారత్ నిలువరించేందుకు ప్రత్యేక కోచింగ్‌లే దోహదం చేశాయన్నారు. భువనేశ్వర్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్ షూటౌట్‌లో గెలిచి బోనస్ పాయింట్ సాధించింది. పెర్త్ (ఆ్రస్టేలియా)లో ‘ఎ’ జట్టుతో ఆడిన ఫ్రెండ్లీ మ్యాచ్‌ల అనుభవం కూడా భారత అమ్మాయిలకు కలిసివస్తుందని చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్ అన్నారు.
ఆసీస్ సీనియర్ జట్టు బలాబలాలేంటో తమకు తెలుసని పరిస్థితులకు తగ్గట్లు వ్యూహాలతోనే బరిలోకి దిగుతామని చెప్పారు. కంగారూ టీమ్‌తో వరుస మ్యాచ్‌లు ముగిసిన వెంటనే ఇక్కడే 17, 18 తేదీల్లో పటిష్టమైన అర్జెంటీనాను ఎదర్కొంటుంది. అనంతరం బెల్జియంకు పయనమవుతుంది. అంట్‌వర్ప్‌లో 21, 22 తేదీలో జరిగే మ్యాచ్‌ల్లో మేటి జట్టయిన బెల్జియంతో ఢీకొంటుంది. చివరగా బెర్లిన్‌లో ఈ నెల 28, 29 తేదీల్లో చైనాతో జరిగే పోటీలతో యూరోప్ అంచె ప్రొ లీగ్ ముగుస్తుంది.