యువ ఆటగాడికి బంపరాఫర్‌.. ఏకంగా రూ.8.40 కోట్లు! ఎవరీ సమీర్‌ రిజ్వీ? | Who Is Sameer Rizvi, The UP Star Bought By CSK For Rs 8.4 Crore In IPL Auction 2024? Know About Him In Telugu - Sakshi
Sakshi News home page

IPL 2024-Sameer Rizvi: యువ ఆటగాడికి బంపరాఫర్‌.. ఏకంగా రూ.8.40 కోట్లు! ఎవరీ సమీర్‌ రిజ్వీ?

Published Tue, Dec 19 2023 5:47 PM

Who is Sameer Rizvi, the UP star bought by CSK for Rs 8.4 crore in IPL auction 2024? - Sakshi

ఐపీఎల్‌-2024 మినీ వేలంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువ బ్యాటర్‌ సమీర్‌ రిజ్వీపై కాసుల వర్షం కురిసింది. రూ. 20 లక్షలతో వేలంలోకి వచ్చిన సమీర్‌ రిజ్వీని రూ.8.40 కోట్ల భారీ ధరకు చెన్నై సూపర్‌ కింగ్స్ సొంతం చేసుకుంది. గుజరాత్‌ టైటాన్స్‌, ఢిల్లీ చెన్నై మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆఖరికి పోటీ నుంచి గుజరాత్‌, ఢిల్లీ తప్పుకోగా సీఎస్‌కే దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఎవరీ సమీర్‌ రిజ్వీ అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.

ఎవరీ సమీర్‌ రిజ్వీ..?
20 ఏళ్ల సమీర్‌ రిజ్వీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఉత్తర్‌ ప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2020లో మధ్యప్రదేశ్‌తో జరిగిన రంజీట్రోఫీ మ్యాచ్‌తో రిజ్వీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అయితే రిజ్వీకు టీ20 క్రికెట్‌లో మంచి రికార్డు ఉంది. కేవలం 9 ఇన్నింగ్స్‌లలో రిజ్వీ 49.16 సగటుతో 295 పరుగులు చేశాడు. ఈ ఏడాది జరిగిన యూపీ టీ20 లీగ్‌లో రిజ్వీ దుమ్మురేపాడు.

ఈ లీగ్‌లో కన్పూర్‌ సూపర్‌ స్టార్స్‌ తరపున ప్రాతినిథ్యం వహించిన రిజ్వీ.. 455 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో కూడా రిజ్వీ అదరగొట్టాడు. ఈ టోర్నీలో ఓవరాల్‌గా 18 సిక్స్‌లు రిజ్వీ కొట్టాడు. టీ20ల్లో అద్భుతంగా రాణిస్తుండడంతోనే రిజ్వీని సీఎస్‌కే సొంతం చేసుకుంది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement