WC 2023: దెబ్బ మీద దెబ్బ.. పాకిస్తాన్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ

WC 2023: Pakistan Players Fined By ICC Match Fee Against South Africa - Sakshi

ICC WC 2023- Baba Azam And Co. Fined: వన్డే వరల్డ్‌కప్‌-2023లో వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న పాకిస్తాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేసినందుకు గానూ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి పాక్‌ జట్టుకు భారీ జరిమానా విధించింది.

కాగా చెన్నైలోని చెపాక్‌ వేదికగా బాబర్‌ ఆజం బృందం శుక్రవారం సౌతాఫ్రికాతో తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ 46.4 ఓవర్లలో 270 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.

ఈ క్రమంలో పాక్‌ విధించిన లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా టాపార్డర్‌ విఫలం కాగా.. నాలుగో నంబర్‌ బ్యాటర్‌ ఎయిడెన్‌ మార్కరమ్‌ 91 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే, అతడు అవుటైన తర్వాత ఆఖరి వరకు హైడ్రామా నెలకొంది. గెలుపునకు చేరువగా వచ్చిన సఫారీలు 10 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోవడంతో చిక్కుల్లో పడింది.

సెమీస్‌ ఆశలపై నీళ్లు!
మరోవైపు.. తొమ్మిదో వికెట్‌ పడగొట్టిన పాకిస్తాన్‌ ఆఖరి వికెట్‌ కోసం 11 బంతులపాటు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. కేశవ్‌ మహరాజ్‌ 48వ ఓవర్‌ రెండో బంతికి ఫోర్‌ బాది సౌతాఫ్రికా విజయాన్ని ఖరారు చేశాడు. దీంతో ఓటమిపాలైన పాకిస్తాన్‌ సెమీస్‌ అవకాశాలు పూర్తి సంక్లిష్టంగా మారాయి.

వరుసగా నాలుగో పరాజయంతో సెమీ ఫైనల్‌ రేసు నుంచి దాదాపు నిష్క్రమించే స్థితికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ నిర్ణీత సమయంలో బౌలింగ్‌ కోటా పూర్తి చేయనట్లు తేలడంతో ఐసీసీ ఫైన్‌ వేసింది. జట్టు మ్యాచ్‌ ఫీజులో 20 శాతం మేర కోత విధిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.

ప్రతీ ఓవర్‌కు ఐదు శాతం చొప్పున.. మొత్తంగా
‘‘నిర్ణీత సమయంలో వేయాల్సిన దానికంటే నాలుగు ఓవర్లు తక్కువగా వేసినందుకు..  ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి సంబంధించిన ప్రవర్తనా నియమావళి ప్రకారం ఆలస్యమైన ప్రతీ ఓవర్‌కు ఐదు శాతం చొప్పున మ్యాచ్‌ ఫీజులో కోత విధించడం జరుగుతుంది’’ అని తెలిపింది. ఈ విషయంలో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం తమ తప్పును అంగీకరించడంతో ఎటువంటి విచారణ అవసరం లేకుండా ఫైన్ వేసినట్లు వెల్లడించింది.

జీతాల్లేవు.. ఆ విషయంలో పీసీబీ వెనుకడుగు
కాగా వరుస ఓటముల నేపథ్యంలో పాకిస్తాన్‌ జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండగా బోర్డు నుంచి మద్దతు కరువైనట్లు ఆటగాళ్లు ఆవేదన చెందుతున్నారనే వార్తలు వస్తున్నాయి. అదే విధంగా.. సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ విషయంలో క్రికెటర్లతో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్న పాక్‌ క్రికెట్‌ బోర్డు వెనక్కి తగ్గే ఆలోచనలో ఉందని ఆ జట్టు మాజీ ఆటగాళ్లు చెప్తున్నారు.

అంతేకాదు ఐదు నెలలుగా పాక్‌ ఆటగాళ్లకు జీతాలు కూడా ఇవ్వడం లేదని సమాచారం. తాజాగా ఇలా మ్యాచ్‌ ఫీజులో కోత పడటంతో పాక్‌ జట్టు పరిస్థితి మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్లు తయారైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

చదవండి: అంతా తెలిసే చేశావంటే నిన్నేమనుకోవాలి? అతడి రాతే అంత.. ఎప్పుడూ ఇలాగే! 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

14-11-2023
Nov 14, 2023, 13:41 IST
టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై అతని వ్యక్తిగత కోచ్‌ దినేశ్‌ లాడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌ వయసుపై, ప్రస్తుత...
14-11-2023
Nov 14, 2023, 12:57 IST
సాక్షి, విశాఖపట్నం: భారత్, న్యూజిలాండ్‌ మధ్య జరిగే ప్రపంచ కప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ను తిలకించేందుకు  ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ)...
14-11-2023
Nov 14, 2023, 11:41 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో ఘోర వైఫల్యాలను ఎదుర్కొని, లీగ్‌ దశలోనే ఇంటిబాట పటి​న శ్రీలంక ఇంటాబయటా ముప్పేట దాడిని ఎదుర్కొంటుంది....
14-11-2023
Nov 14, 2023, 10:32 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో తొమ్మిది వరుస విజయాలు సాధించి లీగ్‌ దశలో అజేయ జట్టుగా నిలిచిన భారత్‌.. బుధవారం జరుగబోయే...
14-11-2023
Nov 14, 2023, 08:13 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023 రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ దశ మ్యాచ్‌లు ముగిసాయి. పాయింట్ల పట్టికలో టాప్‌-4లో నిలిచిన భారత్‌, సౌతాఫ్రికా,...
14-11-2023
Nov 14, 2023, 07:34 IST
భారత్‌-నెదర్లాండ్స్‌ మ్యాచ్‌తో వన్డే వరల్డ్‌కప్‌ 2023 రౌండ్‌ రాబిన్‌ (లీగ్‌) దశ మ్యాచ్‌లు ముగిసాయి. పాయింట్ల పట్టికలో టాప్‌-4లో నిలిచిన...
14-11-2023
Nov 14, 2023, 01:57 IST
సంపూర్ణం... లీగ్‌ దశలో భారత్‌ జైత్రయాత్ర! నెదర్లాండ్స్‌ జట్టుతో మిగిలిన లాంఛనాన్ని ఫుల్‌ ప్రాక్టీస్‌తో టీమిండియా ముగించింది. టాపార్డర్‌ బ్యాటర్లు...
13-11-2023
Nov 13, 2023, 20:11 IST
వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.  టోర్నీలో ఇప్పటికే 500కిపైగా పరుగులు చేసిన...
13-11-2023
Nov 13, 2023, 19:25 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో సెమీఫైనల్స్‌ సమరానికి సమయం అసన్నమైంది. ఈ మెగా టోర్నీ తొలి సెమీఫైనల్లో నవంబర్‌ 15 ముంబై వేదికగా...
13-11-2023
Nov 13, 2023, 18:35 IST
వన్డేప్రపంచకప్‌-2023 లీగ్‌ దశను అద్బుత విజయంతో ముగించిన టీమిండియా.. ఇప్పుడు సెమీఫైనల్‌లో సత్తాచాటేందుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా...
13-11-2023
Nov 13, 2023, 17:45 IST
వన్డే ప్రపంచకప్‌-2023 లీగ్‌ స్టేజీలో తొమ్మిది విజయాలతో ఆజేయంగా నిలిచిన ఇప్పుడు సెమీఫైనల్స్‌ సమరానికి సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో...
13-11-2023
Nov 13, 2023, 15:59 IST
వన్డే ప్రపంచకప్‌-2023లో దారుణ ప్రదర్శన కనబరిచిన పాకిస్తాన్‌ జట్టు.. లీగ్‌ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో పాకిస్తాన్‌ బౌలింగ్‌...
13-11-2023
Nov 13, 2023, 15:28 IST
వన్డే ప్రపంచకప్‌-2023లో టీమిండియా వరుసగా 9వ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. నెదర్లాండ్స్‌తో జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో 160...
13-11-2023
Nov 13, 2023, 15:00 IST
వన్డే ప్రపంచకప్‌-2023 తుది అంకానికి చేరుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా నవంబర్‌ 12న బెంగళూరు వేదికగా జరిగిన భారత్‌-నెదర్లాండ్స్‌...
13-11-2023
Nov 13, 2023, 12:11 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పలు ప్రపంచకప్‌ రికార్డులను కొల్లగొట్టింది. ఈ మ్యాచ్‌లో వ్యక్తిగత...
13-11-2023
Nov 13, 2023, 11:45 IST
వన్డే వరల్డ్‌కప్-2023లో తొమ్మిది వరుస విజయాలు సాధించి, లీగ్‌ దశ అనంతరం అజేయ జట్టుగా నిలిచిన భారత్‌.. ఆదివారం నెదర్లాండ్స్‌పై...
13-11-2023
Nov 13, 2023, 11:16 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టిన రవీంద్ర జడేజా వరల్డ్‌కప్‌ సింగిల్‌ ఎడిషన్‌లో భారత్‌...
13-11-2023
Nov 13, 2023, 10:55 IST
నెదర్లాండ్స్‌పై విక్టరీతో వన్డే వరల్డ్‌కప్‌ 2023లో వరుసగా తొమ్మిది విజయాలు సాధించిన టీమిండియా ఓ అరుదైన ఘనత సాధించింది. వరల్డ్‌కప్‌...
13-11-2023
Nov 13, 2023, 09:28 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్లు కేఎల్‌ రాహుల్‌ (63 బంతుల్లో 102; 11...
13-11-2023
Nov 13, 2023, 08:48 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అదిరిపోయే విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత...

మరిన్ని ఫొటోలు 

Read also in:
Back to Top