
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ముందు శ్రీలంకకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆజట్టు స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా గాయం కారణంగా బంగ్లాతో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని శ్రీలంకకు చెందిన ఓ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ధ్రువీకరించాడు. మంగళవారం(జూలై 8) బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో హసరంగా తొడ కండరాల గాయం బారిన పడినట్లు తెలుస్తోంది.
మ్యాచ్ అనంతరం వనిందును స్కానింగ్ తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా ఎంఆర్‌ఐ స్కాన్ రిపోర్ట్స్ రానిప్పటికి.. సిరీస్ సమయానికి అతడు కోలుకునే అవకాశం లేనిట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్‌లో హసరంగా ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు.
ఈ సిరీస్‌లో 1.67 బౌలింగ్ సగటుతో 9 వికెట్లు తీసి అగ్రస్థానంలో నిలిచాడు. కాగా ఈ శ్రీలంక ఆల్‌రౌండర్ తొడకండరాల గాయం బారిన పడడం ఇదేమి తొలిసారి కాదు. ఇంతకుముందు 2023లో తన గాయానికి శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడు. దీంతో వన్డే వరల్డ్‌కప్-2023కు అతడు దూరమయ్యాడు.
ఆ తర్వాత తిరిగి కోలుకుని మైదానంలో అడుగుపెట్టాడు. ఇప్పుడు మళ్లీ అతడి గాయం తిరగబెట్టింది. ఇక బంగ్లా-శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జూలై 10 నుంచి ప్రారంభం కానుంది. అంతకుముందు బంగ్లాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో లంక కైవసం చేసుకుంది.
బంగ్లాతో టీ20లకు శ్రీలంక జట్టు
చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్, దినేష్ చండిమల్, కమిందు మెండిస్, అవిష్క ఫెర్నాండో, దసున్ షనక, దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వందేర్సే, చమీక కరుణా, చమీక కరుణా ఫెర్నాండో, ఎషాన్ మలింగ
చదవండి: రిషబ్ పంత్ ఏమి గిల్‌క్రిస్ట్ కాదు.. దయచేసి ఇక ఆపేయండి: అశ్విన్