
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ దమ్ములేపుతున్నాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలోనూ శతక్కొట్టిన రిషబ్.. రెండో టెస్టులో అద్భుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు.
దీంతో చాలా మంది పంత్‌ను ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో పోలుస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గిల్‌క్రిస్ట్‌తో పంత్‌ను పోల్చడం మానేయాలని అభిమానులను అశ్విన్ కోరాడు. చాలా ఆంశాల్లో ఆసీస్ దిగ్గజం కంటే పంత్ మెరుగ్గా ఉన్నాడని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
"రిషబ్ పంత్ ఒక అద్బుతమైన ఆటగాడు. అతడికి ఉన్న స్పెషల్ స్కిల్స్ మరొకరు వద్ద లేవు. చాలా మంది అతన్ని ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో పోలుస్తున్నారు. దయచేసి ఇక పై పంత్‌ను గిల్‌క్రిస్ట్‌తో పోల్చొద్దు. గిల్ క్రిస్ట్ కు అంత మంచి డిఫెన్స్ ఆడే టెక్నిక్ లేదు.
అదే రిషబ్ పంత్‌కు డిఫెన్స్ ఆడడంలో అత్యుత్తమ స్కిల్స్ ఉన్నాయి. అయితే నేనేమి గిల్‌క్రిస్ట్‌ను తక్కువ చేసి మాట్లాడడం లేదు. వరల్డ్ క్రికెట్‌లో అతడికంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. విధ్వంసానికి మారు పేరు అతడు. గిల్లీ ఒక అద్బుతమైన వికెట్ కీపర్.
ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి తన జట్టుకు ఎన్నో చారిత్రత్మక విజయాలు అందించాడు. అయితే రిషబ్‌కు గిల్‌క్రిస్ట్‌కు మాత్రం చాలా తేడాలు ఉన్నాయి. అతడి ఏడో స్దానంలో బ్యాటింగ్‌కు వస్తే.. పంత్ ఐదవ స్దానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. పంత్ చేసే పనులు మరో బ్యాటర్ చేయలేడు" అని తన యూట్యూబ్ ఛానల్‌లో అశ్విన్ పేర్కొన్నాడు. కాగా భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు గురువారం నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానుంది.
చదవండి: ICC Test Rankings: వరల్డ్ నెం1 బ్యాటర్‌గా ఇంగ్లండ్ ఆటగాడు.. టాప్-10లోకి గిల్