విజయంతో వెర్‌స్టాపెన్‌ ముగింపు | Verstappen ends with victory | Sakshi
Sakshi News home page

విజయంతో వెర్‌స్టాపెన్‌ ముగింపు

Nov 27 2023 3:38 AM | Updated on Nov 27 2023 3:38 AM

Verstappen ends with victory - Sakshi

అబుదాబి: ఫార్ములావన్‌–2023 సీజన్‌ను ప్రపంచ చాంపియన్, రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ వెర్‌స్టాపెన్‌ విజయంతో ముగించాడు. చివరిదైన 22వ రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలోనూ వెర్‌స్టాపెన్‌ విజేతగా నిలిచాడు. ఈ సీజన్‌లో వెర్‌స్టాపెన్‌ రికార్డుస్థాయిలో 19 రేసుల్లో నెగ్గాడు. మరో రెండు రేసుల్లో పెరెజ్‌ (రెడ్‌బుల్‌), కార్లోస్‌ సెయింజ్‌ (ఫెరారీ) ఒక రేసులో నెగ్గారు.

అబుదాబి గ్రాండ్‌ప్రిని ‘పోల్‌ పొజిషన్‌’తో ఆరంభించిన వెర్‌స్టాపెన్‌ నిర్ణీత 58 ల్యాప్‌లను అందరికంటే వేగంగా ఒక గంట 27 నిమిషాల 02.624 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. కెరీర్‌లో 54వ గెలుపుతో వెర్‌స్టాపెన్‌ ఫార్ములావన్‌ చరిత్రలో అత్యధిక విజయాలు అందుకున్న డ్రైవర్ల జాబితాలో వెటెల్‌ (53)ను అధిగమించి మూడో స్థానానికి చేరుకున్నాడు. హామిల్టన్‌ (103), షుమాకర్‌ (91) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement