వెర్‌స్టాపెన్‌ ‘హ్యాట్రిక్‌’

Verstappen 14th win of the season - Sakshi

వరుసగా మూడో ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ సొంతం

ఈ సీజన్‌లో 14వ విజయం  

దోహా: వేదిక మారినా ఫలితం మారలేదు. ఈ ఏడాది ఫార్ములావన్‌ సీజన్‌లో రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ 14వ విజయం నమోదు చేసుకున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఖతర్‌ గ్రాండ్‌ప్రిలో వెర్‌స్టాపెన్‌ చాంపియన్‌గా నిలిచాడు. నిరీ్ణత 57 ల్యాప్‌లను వెర్‌స్టాపెన్‌ అందరికంటే వేగంగా ఒక గంటా 27 నిమిషాల 39.168 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

ఆస్కార్‌ పియస్ట్రీ (మెక్‌లారెన్‌) రెండో స్థానంలో, లాండో నోరిస్‌ (మెక్‌లారెన్‌) మూడో స్థానంలో నిలిచారు. ప్రపంచ మాజీ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ (మెర్సిడెస్‌), కార్లోస్‌ సెయింజ్‌ (ఫెరారీ) తొలి ల్యాప్‌లోనే వెనుదిరిగారు. ఈ ఫలితంతో వెర్‌స్టాపెన్‌ ఈ సీజన్‌లో మరో ఐదు రేసులు మిగిలి ఉండగానే 433 పాయింట్లతో ప్రపంచ డ్రైవర్స్‌ చాంపియన్‌íÙప్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.

22 రేసుల ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 17 రేసులు ముగిశాయి. ఇందులో 14 రేసుల్లో వెర్‌స్టాపెన్, రెండు రేసుల్లో పెరెజ్‌ (రెడ్‌బుల్‌), మరో రేసులో కార్లోస్‌ సెయింజ్‌ (ఫెరారీ) గెలిచారు. 2021, 2022లలో కూడా వెర్‌స్టాపెన్‌ ప్రపంచ చాంపియన్‌íÙప్‌ టైటిల్‌ను సాధించాడు. ఈ సీజన్‌లోని తదుపరి రేసు యూఎస్‌ఎ గ్రాండ్‌ప్రి ఈనెల 22న జరుగుతుంది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top