India vs South Africa: టికెట్లు సోల్డ్‌ అవుట్‌ | Tickets For India Vs South Africa First ODI Tickets Sold Out Quickly, More Details Inside | Sakshi
Sakshi News home page

India vs South Africa: టికెట్లు సోల్డ్‌ అవుట్‌

Nov 29 2025 9:39 AM | Updated on Nov 29 2025 1:43 PM

Tickets sold out India vs South Africa

వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో డిసెంబర్‌ 6న భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనున్న వన్డే మ్యాచ్‌ తొలి దఫా టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా విశాఖ వేదికగా జరగనున్న చివరిదైన మ్యాచ్‌ డే–నైట్‌ ఫార్మాట్‌లో మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది. 

ఈ మ్యాచ్‌కు సంబంధించి కార్పొరేట్‌ టికెట్లు మినహా.. అభిమానుల కోసం అందుబాటులో ఉంచిన మొత్తం 22,000 టికెట్లలో.. సగం టికెట్లను శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఆన్‌లైన్‌(డిస్ట్రిక్టస్‌ యాప్‌)లో విక్రయానికి పెట్టారు. రూ.1200, రూ.2,000, రూ.2500, రూ.3,00­0, రూ.3,500, రూ.4,000 డినామినేషన్లలో ఉన్న ఈ టికెట్లు కొద్దిసేపట్లోనే అమ్ముడైపోయాయి. మిగిలిన సగం టికెట్లను ఈ నెల 30న సాయంత్రం 4 గంటలకు రెండోసారి విక్రయించనున్నారు. రూ.5,000, రూ.10,0­00, రూ.15,000, రూ.18,000 ధరల టికెట్లను హాస్పిటాలిటీ, సెమీ–హాస్పిటాలిటీ కేటగి­రీల పేరిట విక్రయిస్తున్నారు.

4న జట్ల రాక
ఏసీఏ ఆధ్వర్యంలో ఈ అంతర్జాతీయ మ్యాచ్‌ నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నా­యి. రాయ్‌పూర్‌లో జరిగే రెండో వన్డే ముగించుకుని, డిసెంబర్‌ 4న ఆతిథ్య భారత్‌ జట్టుతో పాటు ఆహ్వాన జట్టు దక్షిణాఫ్రికా విశాఖకు చేరుకోనున్నాయి. 5న ఇరు జట్లు వైఎస్సార్‌ స్టేడియంలో ప్రాక్టీస్‌ చేయనున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement