Thailand Open: పోరాడి ఓడిన సాయిప్రణీత్‌ | Thailand Open: Sai Praneeth loses in Thailand Open quarter-finals | Sakshi
Sakshi News home page

Thailand Open: పోరాడి ఓడిన సాయిప్రణీత్‌

Feb 4 2023 6:03 AM | Updated on Feb 4 2023 6:03 AM

Thailand Open: Sai Praneeth loses in Thailand Open quarter-finals - Sakshi

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. భారత్‌ నుంచి బరిలో మిగిలిన ఏకైక ప్లేయర్‌ భమిడిపాటి సాయిప్రణీత్‌ క్వార్టర్‌ ఫైనల్లో వెనుదిరిగాడు.

బ్యాంకాక్‌లో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో హైదరాబాద్‌కు చెందిన ప్రపంచ 49వ ర్యాంకర్‌ సాయిప్రణీత్‌ 17–21, 23–21, 18–21తో ప్రపంచ 23వ ర్యాంకర్, ఆరో సీడ్‌ లీ షి ఫెంగ్‌ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. 84 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణాయక మూడో గేమ్‌లో సాయిప్రణీత్‌ స్కోరు 12–12 వద్ద ఉన్నపుడు తడబడి వరుసగా ఆరు పాయింట్లు సమర్పించుకోవడం టర్నింగ్‌ పాయింట్‌ అయింది. సాయిప్రణీత్‌కు 1,260 డాలర్ల (రూ. 1 లక్ష 3 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 3,850 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. 

Advertisement
 
Advertisement
Advertisement