టీ20 ప్రపంచకప్‌ కోసం న్యూయార్క్‌కు బయల్దేరిన టీమిండియా | Team India First Batch Led By Rohit Sharma Leaves To USA For T20 World Cup 2024 | Sakshi
Sakshi News home page

టీ20 ప్రపంచకప్‌ కోసం న్యూయార్క్‌కు బయల్దేరిన టీమిండియా

May 26 2024 1:20 PM | Updated on May 26 2024 1:41 PM

Team India First Batch Led By Rohit Sharma Leaves To USA For T20 World Cup 2024

యూఎస్‌ఏ, కరీబియన్‌ దీవులు వేదికగా జూన్‌ 1 నుంచి ప్రారంభంకానున్న టీ20 వరల్డ్‌కప్‌ 2024 కోసం టీమిండియా తొలి బ్యాచ్‌ నిన్న (మే 25) న్యూయార్క్‌కు బయల్దేరింది. 

విరాట్‌ కోహ్లి, హార్దిక్‌ పాండ్యా, సంజూ శాంసన్‌, యశస్వి జైస్వాల్‌, యుజ్వేంద్ర చహల్‌, రింకూ సింగ్‌ (ట్రావెలింగ్‌ రిజర్వ్‌), ఖలీల్‌ అహ్మద్‌ (ట్రావెలింగ్‌ రిజర్వ్‌), ఆవేశ్‌ ఖాన్‌ (ట్రావెలింగ్‌ రిజర్వ్‌) మినహా మొత్తం టీమిండియా నిన్న సాయంత్రం ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ అయ్యింది.

రోహిత్‌ శర్మ నేతృత్వంలోని టీమిండియాకు భారత క్రికెట్‌ అభిమానులు ఘనంగా సెండాఫ్‌ ఇచ్చారు. వివిధ కారణాల చేత తొలి బ్యాచ్‌లో వెళ్లలేని వారు ఈ నెల 30న జట్టుతో కలుస్తారని సమాచారం​. ప్రపంచకప్‌లో భారత ప్రస్తానం జూన్‌ 5న మొదలవుతుంది. 

దీనికి ముందు భారత్‌ జూన్‌ 1న బంగ్లాదేశ్‌తో వార్మప్‌ మ్యాచ్‌ ఆడుతుంది. మెగా టోర్నీలో భారత్‌.. పాకిస్తాన్‌, యూఎస్‌ఏ, ఐర్లాండ్‌, కెనడా దేశాలతో కలిసి గ్రూప్‌-ఏలో పోటీపడనుంది. జూన్‌ 9న టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాక్‌తో తలపడనుంది.

భారత బృందం ప్రపంచకప్‌ కోసం​ బయల్దేరిన దృశ్యాలను బీసీసీఐ సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది. వీటికి భారత క్రికెట్‌ అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది. ఈసారి టీమిండియా తప్పక ప్రపంచకప్‌ ట్రోఫీతో తిరిగిరావాలని ఫ్యాన్స్‌ ఆకాంక్షిస్తున్నారు.

ప్రపంచకప్‌ కోసం బయల్దేరిన భారత బృందం..
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), జస్ప్రీత్‌ బుమ్రా, రిషబ్‌ పంత్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, శుభ్‌మన్‌ గిల్‌ (ట్రావెలింగ్‌ రిజర్వ్‌), అర్ష్‌దీప్‌ సింగ్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, మొహమ్మద్‌ సిరాజ్‌, శివమ్‌ దూబే, రాహుల్‌ ద్రవిడ్‌ (హెడ్‌ కోచ్‌), విక్రమ్‌ రాథోడ్‌ (బ్యాటింగ్‌ కోచ్‌), పరస్‌ మాంబ్రే (బౌలింగ్‌ కోచ్‌), టి దిలీప్‌ (ఫీల్డింగ్‌ కోచ్‌)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement