రోహిత్‌ శర్మ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌ | Mumbai Indians to unveil new version of Rohit Sharma at IPL 2026 | Sakshi
Sakshi News home page

IPL 2026: రోహిత్‌ శర్మ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌

Mar 18 2026 2:05 PM | Updated on Mar 18 2026 2:12 PM

Mumbai Indians to unveil new version of Rohit Sharma at IPL 2026

టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తిరిగి అభిమానులను అలరించేందుకు సిద్దమవతున్నాడు. ఐపీఎల్‌-2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరపున హిట్‌మ్యాన్ బరిలోకి దిగనున్నాడు. ఈ ఏడాది సీజన్ కోసం రోహిత్ పూర్తి స్థాయిలో టీమ్‌తో కలిసి ప్రాక్టీస్‌ మొదలు పెట్టాడు. మంగళవారం నెట్స్‌లో రోహిత్ తీవ్రంగా శ్రమించాడు. 

అయితే ఈ క్యాష్ రిచ్ లీగ్ ఆరంభానికి ముందు రోహిత్‌ అభిమానులకు ముంబై ఇండియన్స్ హెడ్‌కోచ్ మహేలా జయవర్ధనే గుడ్ న్యూస్ చెప్పాడు. ఐపీఎల్‌-19వ సీజన్‌లో రోహిత్ శర్మను 'ఇంపాక్ట్ ప్లేయర్'గా ఉపయోగించే ఆలోచన లేదని, అతను పూర్తిస్థాయి ఆటగాడిగా మైదానంలో ఉంటాడని జయవర్ధనే స్పష్టం చేశాడు.

కాగా గత సీజన్‌లో రోహిత్ చాలా మ్యాచ్‌లలో ఇంపార్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు. కేవలం బ్యాటింగ్ మాత్రమే చేసి, మిగితా సమయంలో డగౌట్‌లో ఉండేవాడు. కానీ ఇప్పుడు ఫీల్డ్‌లో కూడా తన అనుభవాన్ని కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పంచుకోనున్నాడు.

"గతేడాది రోహిత్ శర్మ చిన్న చిన్న గాయాలతో బాధపడ్డాడు. అందుకే అతడిని మేము ఇంపాక్ట్ సబ్‌గా ఉపయోగించాము. వర్క్‌లోడ్ మేనెజ్‌మెంట్‌లో భాగంగానే విశ్రాంతి ఇచ్చాము. మైదానంలో ఉన్నా లేకపోయినా  అతడి ప్రభావం జట్టుపై కచ్చితంగా ఉంటుంది. కానీ ఈ ఏడాది సీజన్‌లో మాత్రం రోహిత్‌ను కచ్చితంగా ఎక్కువ సమయం మైదానంలోనే ఉంచుతాము.

అయితే జట్టులో ఎక్కువ మంది ఆల్‌రౌండర్ల ఉన్నందున.. మ్యాచ్ పరిస్థితుల బట్టి ఇంపాక్ట్ ప్లేయర్‌ను రోటేట్ చేస్తాము" అని ఓ ఇంటర్వ్యూలో జయవర్ధనే పేర్కొన్నాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ త‌మ తొలి మ్యాచ్‌లో మార్చి 29న కేకేఆర్‌తో త‌ల‌ప‌డ‌నుంది.
చదవండి: T20 WC: డీఎస్పీగా సంజూ శాంసన్‌!?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement