‘బాధపడలేదు.. పేరు లేనందుకు నవ్వుకున్నా’ | Suryakumar Yadav Breaks Silence On Losing Team India Captaincy, Says He Just Laughed It Off, Watch Video Went Viral | Sakshi
Sakshi News home page

Suryakumar Yadav: ‘బాధపడలేదు.. పేరు లేనందుకు నవ్వుకున్నా’

Aug 23 2026 7:58 AM | Updated on Aug 23 2026 12:21 PM

Suryakumar Bold Interview-Smiled-When Lost-Team India-Captaincy

Photo Credit: Twitter

టీమిండియా టీ20 స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ తనను టీ20 కెప్టెన్సీ నుంచి తొలగించడంపై మరోసారి స్పందించాడు. కెప్టెన్సీ నుంచి తొలగించినప్పుడు బాధపడలేదు.. కానీ జట్టులో తన పేరు లేనప్పుడు మాత్రం బాగా నవ్వుకున్నా అని సూర్యకుమార్ చెప్పుకొచ్చాడు. భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా నిర్వహించిన "బాత్ అండ్ బోల్" కార్యక్రమానికి హాజరైన సూర్యకుమార్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 

‘సూర్యకుమార్‌, టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచినప్పుడు నువ్వు కెప్టెన్‌గా ఉన్నావు. కానీ ఆ తర్వాతి సిరీస్‌లోనే నిన్ను కెప్టెన్సీ నుంచి తొలగించడమే గాక, జట్టు నుంచి కూడా తీసేశారు. అప్పుడు నీకు ఏమనిపించింది అని ఆకాశ్ చోప్రా ప్రశ్నించాడు. 

దీనికి సూర్యకుమార్ బదులిస్తూ.. ‘ఒక కెప్టెన్‌గా నేను టీమిండియాకు టీ20 ప్రపంచకప్ అందించినందుకు గర్వపడుతున్నా. అయితే జట్టులో నా పేరు లేనప్పుడు నేను ఎలా నవ్వుతానో అలాగే కెప్టెన్సీ నుంచి తొలగించినప్పుడు కూడా అలాగే నవ్వుకున్నా. జట్టు యాజమాన్యం, కోచ్‌, సెలెక్టర్లకు వారి సొంత ఆలోచన ఉందని నేను అర్ధం చేసుకున్నా. 

భవిష్యత్తులో జట్టుకు ఇది మంచి నిర్ణయం అవుతుందనే కారణంతోనే నన్ను జట్టు నుంచి తొలగించారు. వారి నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. కానీ జట్టుకు ఆడేందుకు నేను ఎప్పుడూ సిద్ధమే’ అని సూర్యకుమార్ చెప్పుకొచ్చాడు. 

‘వరుసగా రెండుసార్లు టీ20 ప్రపంచకప్ ఏ జట్టు గెలవలేదు, మూడుసార్లు ట్రోఫీని అందుకోలేదు, సొంతగడ్డపై ఇప్పటివరకు ఏ జట్టు కూడా టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను అందుకోలేదు. కానీ భారత్ మాత్రం ఈ ఘనత సాధించినందుకు మీకు ఎలా ఉంది? అని ప్రశ్నించాడు.

‘అది జరగాలని (భారత్ టీ20 వరల్డ్‌కప్ టైటిల్ గెలవడం) రాసిపెట్టి ఉంటే జరిగి తీరుతుంది. సొంతగడ్డపై వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ అందుకోవడం గొప్ప విషయం. ముఖ్యంగా సంజూ శాంసన్ లీగ్ దశలో విఫలమైనా అతడిపై నమ్మకంతో జట్టులో కొనసాగించాము. ఈ నేపథ్యంలో తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ నేను అతడికి మద్దతుగా ఉన్నా. కానీ సెమీస్‌తో పాటు ఫైనల్లో అతడు ఆడిన ఇన్నింగ్స్‌లు గొప్పవి. అంతేకాదు అతడు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌’గా నిలవడంతో శాంసన్‌పై గౌరవం రెట్టింపు అయింది. ఇక బుమ్రా మాకు అప్పుడు ప్రధాన ఆయుధం.. అతడు రాణించడంతో మా పని సులువయ్యింది’ అని పేర్కొన్నాడు. 

2023లో వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఓటమి చెందినప్పుడు మీరు టీమ్‌లోనే ఉన్నారు. ఈ సమయంలో జట్టులో పరిస్తితి ఎలా ఉంది అని ఆకాశ్ ప్రశ్నించాడు. ‘2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ అహ్మదాబాద్ వేదికగా జరిగింది. కానీ ఆసీస్ చేతిలో ఓడిపోవడంతో సొంతగడ్డపై టైటిల్ అందుకోలేదన్న అపవాదు మూటగట్టుకున్నాం. కానీ మూడేళ్ల తర్వాత ఏ గ్రౌండ్‌లో అయితే ఓడిపోయామో అదే అహ్మదాబాద్‌లో టీ20 ప్రపంచకప్ సాధించి ఆ అపవాదును తుడిచేశాము’ అని సూర్యకుమార్ చెప్పుకొచ్చాడు.

 

Read: బంగ్లా బౌలర్‌ సరికొత్త చరిత్ర.. ఆస్ట్రేలియా 210 ఆలౌట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement