పోరాడి ఓడిన సుమిత్‌ నగాల్‌ | Sumit Nagal loses in Paris Open Masters Series tennis tournament | Sakshi
Sakshi News home page

పోరాడి ఓడిన సుమిత్‌ నగాల్‌

Oct 28 2024 2:57 AM | Updated on Oct 28 2024 2:57 AM

Sumit Nagal loses in Paris Open Masters Series tennis tournament

పారిస్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్‌ సుమిత్‌ నగాల్‌కు నిరాశ ఎదురైంది. ప్రపంచ 71వ ర్యాంకర్‌ క్రిస్టోఫర్‌ ఒకానెల్‌ (ఆ్రస్టేలియా)తో జరిగిన క్వాలిఫయింగ్‌ సింగిల్స్‌ తొలి రౌండ్‌ లో 81వ ర్యాంకర్‌ సుమిత్‌ 4–6, 6–7 (3/7)తో పోరాడి ఓడిపోయాడు. 

గంటా 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్‌ నాలుగు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు.  సుమిత్‌కు 6,380 యూరోల (రూ. 5 లక్షల 79 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.    

Advertisement
 
Advertisement
Advertisement