Sudirman Cup 2023: India Announces Squad, Prannoy And Sindhu To Lead Indian Team - Sakshi
Sakshi News home page

Sudirman Cup 2023: భారత జట్టు ఎంపిక 

Apr 20 2023 2:14 PM | Updated on Apr 20 2023 3:00 PM

Sudirman Cup 2023: India Announces Team - Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌ సుదిర్మన్‌ కప్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. మే 14 నుంచి 21 వరకు చైనాలోని సుజౌలో ఈ టోర్నీ జరుగుతుంది. గ్రూప్‌ ‘సి’లో మలేసియా, చైనీస్‌ తైపీ, ఆస్ట్రేలియా జట్లతో భారత జట్టు ఆడుతుంది. పురుషుల, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఒక్కో మ్యాచ్‌ జరుగుతుంది.  

భారత జట్టు: ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్‌ (పురుషుల సింగిల్స్‌), పీవీ సింధు, అనుపమ (మహిళల సింగిల్స్‌), సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి, ఎంఆర్‌ అర్జున్‌–ధ్రువ్‌ కపిల (పురుషుల డబుల్స్‌), పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ, అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్‌), తనీషా క్రాస్టో–సాయిప్రతీక్‌ (మిక్స్‌డ్‌ డబుల్స్‌).   

Advertisement
 
Advertisement
Advertisement