‘టాప్‌’లోనే స్మృతి | Smriti Mandhana continues to hold the top spot in the batting rankings | Sakshi
Sakshi News home page

‘టాప్‌’లోనే స్మృతి

Oct 14 2026 3:54 AM | Updated on Oct 14 2026 3:54 AM

Smriti Mandhana continues to hold the top spot in the batting rankings

దుబాయ్‌: భారత మహిళల క్రికెట్‌ జట్టు కొత్త కెప్టెన్‌ స్మృతి మంధాన... అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) వన్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇటీవలే హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నుంచి మూడు ఫార్మాట్‌ల సారథ్య బాధ్యతలు అందుకున్న స్మృతి 790 రేటింగ్‌ పాయింట్లతో ‘టాప్‌’లో ఉంది. హర్మన్‌ప్రీత్‌ 652 పాయింట్లతో తొమ్మిదో ర్యాంక్‌లో కొనసాగుతోంది. టీమిండియా నుంచి వీరిద్దరే టాప్‌–10లో చోటు దక్కించుకున్నారు. బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్‌ ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ (614 పాయింట్లు) ఒక స్థానం కోల్పోయి తొమ్మిదో ర్యాంక్‌కు చేరింది. 

టి20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో షఫాలీ వర్మ (759 పాయింట్లు) భారత్‌ తరఫున అత్యుత్తమంగా నాలుగో స్థానంలో ఉండగా... స్మృతి మంధాన (754 పాయింట్లు) ఐదో ర్యాంక్‌లో ఉంది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (656 పాయింట్లు) పదో ‘ప్లేస్‌’లో కొనసాగుతోంది. టి20 బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ స్పిన్నర్‌ శ్రీచరణి (817 పాయింట్లు) అగ్రస్థానంలో ఉండగా... దీప్తి శర్మ (754 పాయింట్లు) రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టి20ల్లో నాలుగో స్థానంలో ఉన్న దీప్తి శర్మ... వన్డేల్లో ఆరో ‘ప్లేస్‌’లో కొనసాగుతోంది. టీమ్‌ విభాగాల్లో వన్డే, టి20ల్లో భారత మహిళల జట్టు మూడో స్థానంలో ఉంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement