
ఏప్రిల్ నెలకు గానూ ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్ల జాబితాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సోమవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డు కోసం ముగ్గురు ఆటగాళ్లను ఐసీసీ షార్ట్‌లిస్ట్ చేసింది.
ఈ లిస్ట్‌లో పాకిస్తాన్ స్టార్ పేసర్ పేసర్ షహీన్ అఫ్రిది, నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్, యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీమ్ ఉన్నారు. వీరిముగ్గురూ ఏప్రిల్ నెలలో అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. అఫ్రిది విషయానికి వస్తే.. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌లొ అదరగొట్టాడు.
ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన షాహీన్.. 8 వికెట్లు పడగొట్టి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే ఐసీసీ అతడిని ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డకు నామినేట్ చేసింది. ఇక నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్.. ఒమన్ పర్యటనలో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. ఒమన్‌తో టీ20 సిరీస్‌ను నమీబియా సాధించడంలో ఎరాస్మస్ కీలక పాత్ర పోషించాడు.
అతడితో పాటు యూఏఈ కెప్టెన్ మహ్మద్ వసీం సైతం ఏప్రిల్ నెలలో అదరగొట్టాడు. ఒమన్ వేదికగా జరిగిన ఏసీసీ ప్రీమియర్ కప్‌లో వసీం దుమ్ములేపాడు. ఓవరాల్‌గా ఏప్రిల్ నెలలో వసీం 44.83 సగటుతో 269 పరుగులు చేశాడు.
ఇక మహిళలల విభాగంలో శ్రీలం కెప్టెన్ చమరి అతపట్టు, వెస్టిండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్, దక్షిణాఫ్రికా స్టార్ లారా వోల్వార్డ్ట్ ఏప్రిల్ నెలకు గాను ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డు రేసులో ఉన్నారు.