చరిత్ర సృష్టించిన స్కాట్లాండ్ సిస్టర్స్‌ | Scotland Bryce Sisters Terrific Batting Vs IRE In ICC Women T20 World Cup 2026, Watch Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

Women T20 WC 2026: ఐర్లాండ్‌ను చితక్కొట్టి చరిత్ర సృష్టించిన స్కాట్లాండ్ సిస్టర్స్‌

Jun 13 2026 4:53 PM | Updated on Jun 13 2026 6:04 PM

Scotland Bryce Sisters Terrific Batting Vs IRE-ICC Women T20-WC-2026

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. స్కాట్లాండ్ స్టిస్ట‌ర్స్ కెప్టెన్ కేథ‌రిన్ బ్రైస్‌, సారా బ్రైస్‌లు త‌మ బ్యాటింగ్‌తో అభిమానులను అల‌రించారు. ఈ ఇద్దరు స్వయానా అక్కాచెల్లి కావడం విశేషం. టోర్నీలో భాగంగా గ్రూప్‌-బిలో శనివారం స్కాట్లాండ్, ఐర్లాండ్ మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ మ‌హిళ‌లు 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 161 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్లు ఇద్ద‌రు విఫ‌ల‌మైన వేళ అక్క కేథ‌రిన్ బ్రైస్‌, ఆమె చెల్లి సారా బ్రైస్‌ ఐర్లాండ్ బౌల‌ర్ల‌ను చిత‌క్కొట్టారు. ఇద్ద‌రు క‌లిసి మూడో వికెట్‌కు శ‌త‌క భాగ‌స్వామ్యం (106 ప‌రుగులు) న‌మోదు చేయ‌డం విశేషం. ఈ నేపథ్యంలో స్కాట్లాండ్ సిస్ట‌ర్స్ త‌మ బ్యాటింగ్‌తో అభిమానుల‌ను అల‌రించ‌డ‌మే గాక ఆ జట్టు తరఫున టీ20 ప్రపంచకప్‌లో శ‌త‌కం భాగ‌స్వామ్యం న‌మోదు చేసిన తొలి జంట‌గా చరిత్ర సృష్టించారు.

39 బంతుల్లో 60 ప‌రుగులు చేసిన కేథ‌రిన్ బ్రైస్ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, ఒక సిక్స‌ర్ ఉన్నాయి. ఇక 35 బంతుల్లో 49 ప‌రుగులు చేసి ఒక్క ప‌రుగు తేడాతో అర్థ‌సెంచ‌రీ చేజార్చుకున్న సారా బ్రైస్ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, ఒక సిక్స‌ర్ ఉన్నాయి.

కాగా పురుషుల క్రికెట్‌లో బ్రదర్స్ కలిసి ఆడిన జట్టు ఏదైనా ఉందంటే ఐర్లాండ్ జట్టు మాత్రమే. ఈ జట్టులోనే ఎక్కువగా అన్నదమ్ములు ప్రాతినిధ్యం వహించిన సందర్భాలు ఉన్నాయి. ఓబ్రియన్ బ్రదర్స్ (కెవిన్‌, నీల్‌), టెక్టర్ బ్రదర్స్ (హ్యారీ, టిమ్, జాక్‌), అడెయిర్ బ్రదర్స్ (మార్క్‌, రాస్‌)లు ఐర్లాండ్ జాతీయ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడారు. 

చదవండి: పోలీసుల చేతిలో చావుదెబ్బలు తిన్న బంగ్లా క్రికెటర్‌!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement