టైటిల్‌ పోరుకు సాకేత్‌–రామ్‌ జోడీ | Saketh Myneni-Ramkumar Ramanathan pair Reaches Final | Sakshi
Sakshi News home page

Chennai Open: టైటిల్‌ పోరుకు సాకేత్‌–రామ్‌ జోడీ

Feb 10 2024 12:27 PM | Updated on Feb 10 2024 12:28 PM

Saketh Myneni-Ramkumar Ramanathan pair Reaches Final - Sakshi

చెన్నై: కెరీర్‌లో 16వ ఏటీపీ చాలెంజర్‌ డబుల్స్‌ టైటిల్‌ సాధించడానికి భారత డేవిస్‌కప్‌ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ సాకేత్‌ మైనేని విజయం దూరంలో నిలిచాడు. చెన్నై ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌–100 టోర్నీలో సాకేత్‌–రామ్‌కుమార్‌ రామనాథన్‌ (భారత్‌) జోడీ పురుషుల డబుల్స్‌ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. హైదరాబాద్‌కు చెందిన బొల్లిపల్లి రిత్విక్‌ చౌదరీ–నిక్కీ పునాచా (భారత్‌) జంటతో నేడు జరిగే ఫైనల్లో సాకేత్‌–రామ్‌కుమార్‌ ద్వయం తలపడుతుంది.

శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో సాకేత్‌–రామ్‌కుమార్‌ 6–3, 6–2తో రెండో సీడ్‌ తొషిహిడె మత్సుయ్‌–కైటో యుసుగి (జపాన్‌)లపై నెగ్గగా... రిత్విక్‌–నిక్కీ పునాచా 6–3, 4–6, 10–7తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో జేకబ్‌ షానైటర్‌–మార్క్‌ వాల్నర్‌ (జర్మనీ)లను ఓడించారు. 58 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్‌లో సాకేత్‌–రామ్‌ జోడీ ఎనిమిది ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement