ముగిసిన సౌతాఫ్రికా టీ20 లీగ్‌ వేలం​..  తుది జట్లు ఇవే..! | Sakshi
Sakshi News home page

ముగిసిన సౌతాఫ్రికా టీ20 లీగ్‌ వేలం​..  తుది జట్లు ఇవే..!

Published Thu, Sep 28 2023 5:42 PM

SA20 2024: Complete Squads Of All Six Teams After Auction - Sakshi

2024 సౌతాఫ్రికా టీ20 లీగ్‌కు సంబంధించిన వేలం జోహన్నెస్‌బర్గ్‌లో నిన్న ముగిసింది. ఈ లీగ్‌ రెండో ఎడిషన్‌లో పాల్గొనబోయే ఆరు జట్లు తమతమ ఆటగాళ్ల వివరాలను వెల్లడించాయి. పర్స్‌ వ్యాల్యూ మేరకు అన్ని ఫ్రాంచైజీలు పటిష్టమైన జట్లను ఎంపిక చేసుకున్నాయి. ఈ వేలంలో సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ దయ్యన్‌ గలీమ్‌ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ అతన్ని 1.60 మిలియన్లకు దక్కించుకుంది.

జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ వెటరన్‌ స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ను వైల్డ్‌కార్డ్‌ పిక్‌గా ఎంపిక చేసుకోగా.. పార్ల్‌ రాయల్స్‌ లోర్కన్‌ టక్కర్‌ను బేస్‌ ధరకు వైల్డ్‌ కార్డ్‌ పిక్‌గా ఎంపిక చేసుకుంది. ఆయా జట్ల కెప్టెన్ల విషయానికొస్తే.. పార్ల్‌ రాయల్స్‌కు (రాజస్తాన్‌ రాయల్స్‌) జోస్‌ బట్లర్‌, డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌కు (లక్నో సూపర్‌ జెయింట్స్‌) కేశవ్‌ మహారాజ్‌, ప్రిటోరియా క్యాపిటల్స్‌కు (ఢిల్లీ క్యాపిటల్స్‌) వేన్‌ పార్నెల్‌, ముంబై ఇండియన్స్‌ కేప్‌టౌన్‌కు (ముంబై ఇండియన్స్‌) రషీద​ ఖాన్‌, జోబర్గ్‌ సూపర్‌కింగ్స్‌కు (చెన్నై సూపర్‌ కింగ్స్‌) ఫాఫ్‌ డుప్లెసిస్‌, సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌ కేప్‌కు (సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌) ఎయిడెన్‌ మార్క్రమ్‌ నాయకత్వం వహించనున్నారు.

సౌతాఫ్రికన్‌ లీగ్‌లో పాల్గొనే ఆరు జట్లు ఐపీఎల్‌ ఫ్రాంచైజీల యాజమాన్యాల ఆథ్వర్యంలో నడుస్తున్నాయి. ఈ ఆరు ఫ్రాంచైజీలను వేర్వేరు ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. కాగా, సౌతాఫ్రికా టీ20 లీగ్‌ ఆరంభ ఎడిషన్‌లో (2023) సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌ కేప్‌ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్‌ జట్టు ప్రిటోరియా క్యాపిటల్స్‌ను ఖంగుతినిపించి ఛాంపియన్‌గా అవతరించింది. 2024 సీజన్‌ జనవరి 10న మొదలై ఫిబ్రవరి 10న ముగుస్తుంది.

పూర్తి జట్ల వివరాలు..

ప్రిటోరియా క్యాపిటల్స్: పాల్ స్టెర్లింగ్, కైల్ వెర్రెన్‌, రిలీ రొస్సో, కొలిన్ ఇంగ్రామ్, థీనిస్ డి బ్రుయిన్, విల్ జాక్స్, షేన్ డాడ్స్‌వెల్, డారిన్ డుపావిల్లోన్, మిగేల్ ప్రిటోరియస్, అన్రిచ్ నోర్ట్జే, ఆదిల్ రషీద్, ఈథన్ బాష్, కార్బిన్ బాష్, మాథ్యూ బోస్ట్, జిమ్మీ నీషమ్, సెనురన్‌ ముత్తసామి, వేన్‌ పార్నెల్ (కెప్టెన్‌), స్టీవ్ స్టోక్

పార్ల్ రాయల్స్: లోర్కన్ టక్కర్, డేవిడ్ మిల్లర్, జోస్ బట్లర్ (కెప్టెన్‌), జేసన్ రాయ్, డేన్ విలాస్, మిచెల్ వాన్ బ్యూరెన్, లువాన్ డ్రే ప్రిటోరియస్, జాన్ టర్నర్, క్వేనా మఫాకా, ఒబెద్‌ మెక్‌కాయ్, తబ్రేజ్‌ షంషి, లుంగి ఎంగిడి, బ్జోర్న్ ఫోర్టుయిన్, కోడి యూసుఫ్, ఆండిల్ ఫెహ్లుక్వాయో, విహాన్‌ లుబ్బే, ఫెరిస్కో ఆడమ్స్, ఇవాన్ జోన్స్, ఫాబియన్ అలెన్

ఎంఐ కేప్ టౌన్: క్రిస్ బెంజమిన్, డెవాల్డ్ బ్రెవిస్, టామ్ బాంటన్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ర్యాన్ రికెల్టన్, గ్రాంట్ రోలోఫ్సెన్, కానర్ ఎస్టర్‌హుజెన్, నీలన్ వాన్ హీర్డెన్, థామస్ కబెర్, కగిసో రబడ, రషీద్ ఖాన్ (కెప్టెన్‌), బ్యూరాన్ హెండ్రిక్స్, ఒల్లీ స్టోన్, జోఫ్రా ఆర్చర్, సామ్ కర్రన్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, డెలానో పాట్గెటర్‌, జార్జ్ లిండే, డువాన్ జన్సెన్

జోబర్గ్ సూపర్ కింగ్స్: వేన్ మాడ్సెన్, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), ల్యూస్ డు ప్లూయ్, రీజా హెండ్రిక్స్, డోనోవన్ ఫెర్రీరా, సిబోనెలో మఖాన్యా, రోనన్ హెర్మన్, రొమారియో షెపర్డ్, గెరాల్డ్ కోయెట్జీ, జహీర్ ఖాన్, సామ్ కుక్, లిజాడ్ విలియమ్స్, నాండ్రే బర్గ్‌డర్, ఆరోన్ ఫాంగిసొ, కైల్‌ సిమ్మండ్స్‌, దయ్యన్‌ గలీమ్‌, మొయిన్ అలీ, డేవిడ్ వీస్

డర్బన్ సూపర్ జెయింట్స్: క్వింటన్ డికాక్, భానుక రాజపక్స, హెన్రిచ్ క్లాసెన్, మాథ్యూ బ్రీట్జ్కే, నికోలస్ పూరన్, ప్రేనెలన్ సుబ్రాయెన్, నవీన్ ఉల్ హక్, రీస్ టాప్లీ, కేశవ్ మహరాజ్ (కెప్టెన్‌), కైల్ అబాట్, జూనియర్ డాలా, జాసన్ స్మిత్, కైల్ మేయర్స్, డ్వేన్‌ ప్రిటోరియస్‌, కీమో పాల్‌, వియాన్‌ ముల్దర్‌, జోన్ జోన్ స్మట్స్, బ్రైస్ పార్సన్స్

సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌ కేప్: ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్‌), డేవిడ్ మలాన్, ట్రిస్టన్ స్టబ్స్, టెంబా బవుమా, జోర్డాన్ హెర్మాన్, ఆడమ్ రోసింగ్టన్, సరెల్ ఎర్వీ, కాలేబ్ సెలెకా, ఒట్నీల్ బార్ట్‌మన్, లియామ్ డాసన్, సిసంద మగాలా, బ్రైడన్ కార్స్‌, సైమన్ హెర్మెర్, క్రెయిగ్ ఒవర్టన్‌, బేయర్స్‌ స్వేన్‌పోల్‌, మార్కో జన్సెన్‌, అయా క్వామేన్‌, టామ్ అబెల్, ఆండిల్‌ సిమెలన్  

Advertisement

తప్పక చదవండి

Advertisement