-
ముగిసిన సౌతాఫ్రికా టీ20 లీగ్ వేలం.. తుది జట్లు ఇవే..!
2024 సౌతాఫ్రికా టీ20 లీగ్‌కు సంబంధించిన వేలం జోహన్నెస్‌బర్గ్‌లో నిన్న ముగిసింది. ఈ లీగ్ రెండో ఎడిషన్‌లో పాల్గొనబోయే ఆరు జట్లు తమతమ ఆటగాళ్ల వివరాలను వెల్లడించాయి. పర్స్ వ్యాల్యూ మేరకు అన్ని ఫ్రాంచైజీలు పటిష్టమైన జట్లను ఎంపిక చేసుకున్నాయి. ఈ వేలంలో సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ దయ్యన్ గలీమ్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. జోబర్గ్ సూపర్ కింగ్స్ అతన్ని 1.60 మిలియన్లకు దక్కించుకుంది. జోబర్గ్ సూపర్ కింగ్స్ వెటరన్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌ను వైల్డ్‌కార్డ్ పిక్‌గా ఎంపిక చేసుకోగా.. పార్ల్ రాయల్స్ లోర్కన్ టక్కర్‌ను బేస్ ధరకు వైల్డ్ కార్డ్ పిక్‌గా ఎంపిక చేసుకుంది. ఆయా జట్ల కెప్టెన్ల విషయానికొస్తే.. పార్ల్ రాయల్స్‌కు (రాజస్తాన్ రాయల్స్) జోస్ బట్లర్, డర్బన్ సూపర్ జెయింట్స్‌కు (లక్నో సూపర్ జెయింట్స్) కేశవ్ మహారాజ్, ప్రిటోరియా క్యాపిటల్స్‌కు (ఢిల్లీ క్యాపిటల్స్) వేన్ పార్నెల్, ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌కు (ముంబై ఇండియన్స్) రషీద ఖాన్, జోబర్గ్ సూపర్‌కింగ్స్‌కు (చెన్నై సూపర్ కింగ్స్) ఫాఫ్ డుప్లెసిస్, సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్‌కు (సన్‌రైజర్స్ హైదరాబాద్) ఎయిడెన్ మార్క్రమ్ నాయకత్వం వహించనున్నారు. సౌతాఫ్రికన్ లీగ్‌లో పాల్గొనే ఆరు జట్లు ఐపీఎల్ ఫ్రాంచైజీల యాజమాన్యాల ఆథ్వర్యంలో నడుస్తున్నాయి. ఈ ఆరు ఫ్రాంచైజీలను వేర్వేరు ఐపీఎల్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. కాగా, సౌతాఫ్రికా టీ20 లీగ్ ఆరంభ ఎడిషన్‌లో (2023) సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్ జట్టు ప్రిటోరియా క్యాపిటల్స్‌ను ఖంగుతినిపించి ఛాంపియన్‌గా అవతరించింది. 2024 సీజన్ జనవరి 10న మొదలై ఫిబ్రవరి 10న ముగుస్తుంది. పూర్తి జట్ల వివరాలు.. ప్రిటోరియా క్యాపిటల్స్: పాల్ స్టెర్లింగ్, కైల్ వెర్రెన్, రిలీ రొస్సో, కొలిన్ ఇంగ్రామ్, థీనిస్ డి బ్రుయిన్, విల్ జాక్స్, షేన్ డాడ్స్వెల్, డారిన్ డుపావిల్లోన్, మిగేల్ ప్రిటోరియస్, అన్రిచ్ నోర్ట్జే, ఆదిల్ రషీద్, ఈథన్ బాష్, కార్బిన్ బాష్, మాథ్యూ బోస్ట్, జిమ్మీ నీషమ్, సెనురన్ ముత్తసామి, వేన్ పార్నెల్ (కెప్టెన్), స్టీవ్ స్టోక్ పార్ల్ రాయల్స్: లోర్కన్ టక్కర్, డేవిడ్ మిల్లర్, జోస్ బట్లర్ (కెప్టెన్), జేసన్ రాయ్, డేన్ విలాస్, మిచెల్ వాన్ బ్యూరెన్, లువాన్ డ్రే ప్రిటోరియస్, జాన్ టర్నర్, క్వేనా మఫాకా, ఒబెద్ మెక్కాయ్, తబ్రేజ్ షంషి, లుంగి ఎంగిడి, బ్జోర్న్ ఫోర్టుయిన్, కోడి యూసుఫ్, ఆండిల్ ఫెహ్లుక్వాయో, విహాన్ లుబ్బే, ఫెరిస్కో ఆడమ్స్, ఇవాన్ జోన్స్, ఫాబియన్ అలెన్ ఎంఐ కేప్ టౌన్: క్రిస్ బెంజమిన్, డెవాల్డ్ బ్రెవిస్, టామ్ బాంటన్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ర్యాన్ రికెల్టన్, గ్రాంట్ రోలోఫ్సెన్, కానర్ ఎస్టర్‌హుజెన్, నీలన్ వాన్ హీర్డెన్, థామస్ కబెర్, కగిసో రబడ, రషీద్ ఖాన్ (కెప్టెన్), బ్యూరాన్ హెండ్రిక్స్, ఒల్లీ స్టోన్, జోఫ్రా ఆర్చర్, సామ్ కర్రన్, లియామ్ లివింగ్‌స్టోన్, డెలానో పాట్గెటర్, జార్జ్ లిండే, డువాన్ జన్సెన్ జోబర్గ్ సూపర్ కింగ్స్: వేన్ మాడ్సెన్, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), ల్యూస్ డు ప్లూయ్, రీజా హెండ్రిక్స్, డోనోవన్ ఫెర్రీరా, సిబోనెలో మఖాన్యా, రోనన్ హెర్మన్, రొమారియో షెపర్డ్, గెరాల్డ్ కోయెట్జీ, జహీర్ ఖాన్, సామ్ కుక్, లిజాడ్ విలియమ్స్, నాండ్రే బర్గ్డర్, ఆరోన్ ఫాంగిసొ, కైల్ సిమ్మండ్స్, దయ్యన్ గలీమ్, మొయిన్ అలీ, డేవిడ్ వీస్ డర్బన్ సూపర్ జెయింట్స్: క్వింటన్ డికాక్, భానుక రాజపక్స, హెన్రిచ్ క్లాసెన్, మాథ్యూ బ్రీట్జ్కే, నికోలస్ పూరన్, ప్రేనెలన్ సుబ్రాయెన్, నవీన్ ఉల్ హక్, రీస్ టాప్లీ, కేశవ్ మహరాజ్ (కెప్టెన్), కైల్ అబాట్, జూనియర్ డాలా, జాసన్ స్మిత్, కైల్ మేయర్స్, డ్వేన్ ప్రిటోరియస్, కీమో పాల్, వియాన్ ముల్దర్, జోన్ జోన్ స్మట్స్, బ్రైస్ పార్సన్స్ సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్: ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డేవిడ్ మలాన్, ట్రిస్టన్ స్టబ్స్, టెంబా బవుమా, జోర్డాన్ హెర్మాన్, ఆడమ్ రోసింగ్టన్, సరెల్ ఎర్వీ, కాలేబ్ సెలెకా, ఒట్నీల్ బార్ట్‌మన్, లియామ్ డాసన్, సిసంద మగాలా, బ్రైడన్ కార్స్, సైమన్ హెర్మెర్, క్రెయిగ్ ఒవర్టన్, బేయర్స్ స్వేన్పోల్, మార్కో జన్సెన్, అయా క్వామేన్, టామ్ అబెల్, ఆండిల్ సిమెలన్ -
ఐపీఎల్ 2023లో కొత్త రూల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 నుంచి కొత్త రూల్ అమల్లోకి రానుంది. ఫ్రాంచైజీలు తమ తుది జట్లను, ఇంపాక్ట్ ప్లేయర్ పేరు వివరాలను టాస్ తర్వాత ప్రకటించే వెసలుబాటు కల్పించింది బీసీసీఐ. దీంతో టాస్ గెలుపోటముల ఆధారంగా ఫ్రాంచైజీలు అత్యుత్తమ జట్టును ఎంచునే అవకాశం ఉంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్‌ను ఎంచుకునే విషయంలో ఈ కొత్త రూల్ చాలా ఉపయోగపడుతుంది. తొలుత బ్యాటింగ్ చేయాల్సి వస్తే ఓ జట్టును, అదే తొలుత బౌలింగ్ చేయాల్సి వస్తే మరో జట్టును ఎంచకునే అవకాశం ఫ్రాంచైజీలకు దక్కుతుంది. గత సీజన్ వరకు కెప్టెన్లు టాస్కు ముందే తుది జట్లు, ఇంపాక్ట్ ప్లేయర్ వివరాలను వెల్లడించేవారు. ఇలా చేయడం వల్ల ఫ్రాంచైజీలకు ఉపయోగకరమైన తుది జట్టును ఎంచునే విషయంలో కాస్త అసంతృప్తి ఉండేది. ఈ నయా రూల్‌ను గతంలో సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో అమలు చేశారు. ఫ్రాంచైజీలు టాస్ తర్వాత తుది జట్టును ప్రకటించే ముందు టీమ్ షీట్‌పై 13 మంది ప్లేయర్ల వివరాలను ఉంచాల్సి ఉంటుంది. ఈ జాబితా నుంచే 11 మంది ప్లేయర్లు, ఇంపాక్ట్ ప్లేయర్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. కాగా, రానున్న ఐపీఎల్ సీజన్లో మరిన్ని కొత్త రూల్స్ కూడా అమల్లోకి రానున్నాయి. అవేంటంటే.. నిర్దిష్ట సమయ వ్యవధిలో బౌలర్ ఓవర్ పూర్తి చేయకుంటే ఓవర్ రేట్ పెనాల్టీ ఉంటుంది. ఓవర్ రేట్ పెనాల్టీ పడితే 30 యార్డ్స్ సర్కిల్ వెలుపల నలుగురు ఫీల్డర్లు మాత్రమే అనుమతించబడతారు. అలాగే ఫీల్డర్ లేదా వికెట్ కీపర్ అన్యాయమైన కదలికలకు పాల్పడితే బంతిని డెడ్ బాల్‌గా ప్రకటించి ప్రత్యర్ధికి 5 పెనాల్టీ పరుగులు ఇస్తారు. మార్చి 31 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్-2023 సీజన్లో పై పేర్కొన్న రూల్స్ అన్ని అమల్లోకి వస్తాయని బీసీసీఐకి చెందిన కీలక అధికారి ప్రకటించారు. డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 16వ ఎడిషన్ ప్రారంభమవుతుంది. మార్చి 31 నుంచి మే 28 వరకు జరిగే ఈ క్రికెట్ సంబరంలో మొత్తం 70 మ్యాచ్‌లు జరుగనున్నాయి. -
సన్‌రైజర్స్ కొత్త సారధి పేరు ప్రకటన.. ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ ఎవరంటే..?
Aiden Markram: మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్-2023 సీజన్ ప్రారంభంకానున్న నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఇవాళ (ఫిబ్రవరి 23) తమ నూతన సారధి పేరును అధికారికంగా ప్రకటించింది. మినీ ఐపీఎల్‌గా పరిగణించబడే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో (ఎస్ఏ20) తమ సిస్టర్ ఫ్రాంచైజీ అయిన సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టిన సఫారీ ఆటగాడు ఎయిడెన్ మార్క్రమ్ను ఎస్ఆర్హెచ్ యాజమాన్యం కెప్టెన్‌గా నియమించింది. నిరీక్షణకు తెరపడింది.. ఆరెంజ్ ఆర్మీ కొత్త కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్కు హలో చెప్పండి అంటూ ట్విటర్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. THE. WAIT. IS. OVER. ⏳#OrangeArmy, say hello to our new captain Aiden Markram 🧡#AidenMarkram #SRHCaptain #IPL2023 | @AidzMarkram pic.twitter.com/3kQelkd8CP — SunRisers Hyderabad (@SunRisers) February 23, 2023 కాగా, ఐపీఎల్ 2023 మినీ వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను వేలానికి విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కెప్టెన్ ఎంపిక అనివార్యం కాగా.. రేసులో పలువురి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఎస్ఆర్హెచ్ కెప్టెన్సీ రేసులో మయాంక్ అగర్వాల్, భువనేశ్వర్ కుమార్, ఎయిడెన్ మార్క్రమ్లు పోటీ పడగా.. యాజమాన్యం మార్క్రమ్ వైపు మొగ్గు చూపింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, సమర్థ్ వ్యాస్, గ్లెన్ ఫిలిప్స్, అన్మోల్ప్రీత్ సింగ్, హ్యారీ బ్రూక్, అబ్దుల్ సమద్, నితీశ్‌కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, ఉపేంద్ర యాదవ్, సన్వీర్ సింగ్, వివ్రాంత్ శర్మ, అభిషేక్ శర్మ, మార్కో జన్సెన్, వాషింగ్టన్ సుందర్, కార్తీక్ త్యాగీ, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్, ఫజల్ హక్ ఫారూఖీ, భువనేశ్వర్ కుమార్, ఆదిల్ రషీద్, అకీల్ హొసేన్, మయాంక్ డాగర్, మయాంక్ మార్కండే -
ఎట్టకేలకు కావ్య పాప ఖుషీ.. తొలి మినీ ఐపీఎల్ ఛాంపియన్‌గా సన్‌రైజర్స్
మినీ ఐపీఎల్‌గా పరిగణించబడే సౌతాఫ్రికా టీ20 లీగ్ ఇనాగురల్ ఎడిషన్ టైటిల్‌ను సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ టీమ్ హస్తగతం చేసుకుంది. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 12) జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్.. 19.3 ఓవర్లలో 135 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. CHAMPIONS‼️‼️‼️@SunrisersEC are the winners of the inaugural #Betway #SA20 🏆 The title is heading to Gqeberha‼️@Betway_India pic.twitter.com/ODHLNdtQke — Betway SA20 (@SA20_League) February 12, 2023 వాన్ డెర్ మెర్వ్ 4, మగాలా, బార్ట్‌మన్ తలో 2 వికెట్లు, జన్సెన్, మార్క్రమ్ చెరో వికెట్ పడగొట్టి ప్రిటోరియాను దారుణంగా దెబ్బకొట్టారు. ప్రిటోరియా ఇన్నింగ్స్‌లో కుశాల్ మెండిస్ (21) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. That winning moment 🧡🧡🧡#Betway #SA20 @Betway_India pic.twitter.com/b1uI45aYr0 — Betway SA20 (@SA20_League) February 12, 2023 అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. 16.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ ఆడమ్ రొస్సింగ్టన్ (30 బంతుల్లో 57; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ధశతకంతో చెలరేగగా, హెర్మన్ (22), కెప్టెన్ మార్క్రమ్ (26), జన్సెస్ (13 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. ప్రిటోరియా బౌలర్లలో నోర్జే 2, ఈథన్ బోష్, ఆదిల్ రషీద్, కొలిన్ ఇంగ్రామ్, జేమ్స్ నీషమ్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఐపీఎల్ జట్టైన సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాని కావ్య మారన్.. సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్లో గత కొన్ని సీజన్లుగా సత్తా చాటలేకపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఎట్టకేలకు మినీ ఐపీఎల్ టైటిల్ గెలవడం ద్వారా తమ కోరిక నెరవేర్చుకుంది. సన్‌రైజర్స్ టైటిల్ గెలవడంతో ఎట్టకేలకు కావ్య పాప ఖుషీ అయ్యిందంటూ ఫ్రాంచైజీ అభిమానులు చర్చించుకుంటున్నారు. -
క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్. మినీ ఐపీఎల్‌గా పరిగణించబడే సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20) ఇనాగురల్ ఎడిషన్ (2023) ఫైనల్ మ్యాచ్ వాయిదా పడింది. ఎడతెరిపి లేని వర్షం, ప్రతికూల వాతావరణం కారణంగా జొహనెస్‌బర్గ్ వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 11) జరగాల్సిన మ్యాచ్‌ను రిజర్వ్ డే అయిన రేపటికి (ఫిబ్రవరి 12) వాయిదా వేస్తున్నట్లు లీగ్ కమీషనర్ గ్రేమ్ స్మిత్ అధికారికంగా ప్రకటించారు. ఫైనల్ మ్యాచ్ రేపు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుందని స్మిత్ వెల్లడించారు. స్థానికి వాతావరణ శాఖ ముందస్తు సమాచారం మేరకు రేపు వర్షం కురిసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ (ఐపీఎల్) యాజమాన్యం కొనుగోలు చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యంలోని సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ ఫ్రాంచైజీలు తొట్టతొలి ఎస్ఏ20 లీగ్ ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. తొలి సెమీఫైనల్లో పార్ల్ రాయల్స్ (రాజస్తాన్ రాయల్స్)ను మట్టికరిపించి క్యాపిటల్స్.. రెండో సెమీఫైనల్లో జోబర్గ్ సూపర్‌కింగ్స్ (చెన్నై సూపర్ కింగ్స్)పై విజయం సాధించి సన్‌రైజర్స్ తుదిపోరుకు అర్హత సాధించాయి. పలు మార్పులు చేర్పుల తర్వాత సన్‌రైజర్స్, క్యాపిటల్స్ పూర్తి జట్లు ఇలా ఉన్నాయి. సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్: ఆడమ్ రొస్సింగ్టన్ (వికెట్‌కీపర్), టెంబా బవుమా, జోర్డాన్ హెర్మన్, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, జోర్డన్ కాక్స్, మార్కో జన్సెన్, బ్రైడన్ కార్స్, ఒట్నీల్ బార్ట్‌మన్, రోల్ఫ్ వాన్ డెర్ మెర్వ్, సిసండ మగాలా, జెజె స్మట్స్, జేమ్స్ ఫుల్లర్, అయబెలేల క్వమేన్, మెసన్ క్రేన్, సరల్ ఎర్వీ, మార్కస్ ఆకెర్మెన్, జనైద్ దావూద్ ప్రిటోరియా క్యాపిటల్స్: ఫిలిప్ సాల్ట్, కుశాల్ మెండిస్, థెయునిస్ డి బ్రూన్, రిలీ రొస్సో, కొలిన్ ఇంగ్రామ్, జేమ్స్ నీషమ్, ఈథన్ బోష్, సెనూరన్ ముత్తుస్వామి, మిగేల్ ప్రిటోరియస్, ఆదిల్ రషీద్, అన్రిచ్ నోర్జే, డేరిన్ డుపావిల్లోన్, జాషువ లిటిల్, విల్ జాక్స్, వేన్ పార్నెల్, క్లైడ్ ఫోర్టిన్, కెమరూన్ డెల్పోర్ట్, షాన్ ఓన్ బర్గ్, మార్కో మరియాస్, షేన్ డాడ్స్వెల్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్‌కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్‌తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్‌క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement