SA20 2023: విల్‌ జాక్స్‌ ఊచకోత.. చెలరేగిన బేబీ ఏబీడీ

SA20 2023: Will Jacks 92 Fires Pretoria Capitals To Easy Win VS Sunrisers - Sakshi

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌ కేప్‌తో నిన్న (జనవరి 14) జరిగిన మ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్‌ 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన క్యాపిటల్స్‌..  విల్‌ జాక్స్‌ (46 బంతుల్లో 92; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది.

జాక్స్‌కు జతగా డి బ్రూన్‌ (23 బంతుల్లో 42; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించడంతో క్యాపిటల్స్‌ టీమ్‌ ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉం‍చింది. ఛేదనలో క్యాపిటల్స్‌ బౌలర్లు పార్నెల్‌ (2/20), ఆదిల్‌ రషీద్‌ (2/46), నోర్జే (1/37), నీషమ్‌ (1/13), ఈథన్‌ బాష్‌ (1/33) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో సన్‌రైజర్స్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 179 పరుగులకు మాత్రమే పరిమితమై ఓటమిపాలైంది. సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో మార్క్రమ్‌ (29 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

చెలరేగిన బేబీ ఏబీడీ.. రెచ్చిపోయిన ఎంఐ బౌలర్లు
లీగ్‌లో భాగంగా నిన్న (జనవరి 14) జరిగిన మరో మ్యాచ్‌లో రబాడ (2/12), రషీద్‌ ఖాన్‌ (2/18), జార్జ్‌ లిండే (2/25), ఓడియన్‌ స్మిత్‌ (2/10)  రెచ్చిపోవడంతో జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్‌ కేప్‌ టౌన్‌ టీమ్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సూపర్‌ కింగ్స్‌.. నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్‌ చేసి 9 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేయగా, ఎంఐ జట్టు 16.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

బేబీ ఏబీడీ డెవాల్డ్‌ బ్రెవిస్‌ (34 బంతుల్లో 42; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి సత్తా చాటగా.. ఆఖర్లో సామ్‌ కర్రన్‌ (15 నాటౌట్‌) మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. లీగ్‌లో భాగంగా ఇవాళ (జనవరి 15) డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌-పార్ల్‌ రాయల్స్‌ జట్లు తలపడనున్నాయి.  

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top