రుతురాజ్‌ గైక్వాడ్‌ విధ్వంసకర సెంచరీ.. కేవలం 52 బంతుల్లోనే | Sakshi
Sakshi News home page

IND vs AUS: రుతురాజ్‌ గైక్వాడ్‌ విధ్వంసకర సెంచరీ.. కేవలం 52 బంతుల్లోనే

Published Tue, Nov 28 2023 8:59 PM

Ruturaj Gaikwad Slams Maiden T20I Hundred Against Australia - Sakshi

గౌహతి వేదికగా ఆస్ట్రేలియాతో​ జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా యువ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ మెరుపు సెంచరీతో చెలరేగాడు. హాఫ్‌ సెంచరీ వరకు కాస్త ఆచితూచి ఆడిన గైక్వాడ్‌.. ఆ తర్వాత ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు.

ఈ క్రమంలో కేవలం 52 బంతుల్లో రుతురాజ్‌ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. రుత్‌రాజ్‌కు ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం గమానార్హం. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 57 బంతులు ఎదుర్కొన్న రుత్‌రాజ్‌ 13 ఫోర్లు, 7 సిక్స్‌లతో 123 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఇ​క రుతు విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఫలితంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అతడితో పాటు సూర్యకుమార్‌ యాదవ్‌(39), తిలక్‌ వర్మ(31) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. ఆసీస్‌ బౌలర్లలో బెహ్రెన్‌డార్ఫ్, రిచర్డ్‌సన్‌, హార్థీ తలా వికెట్‌ సాధించారు.
చదవండి: అగార్కర్‌ బృందం కసరత్తు.. ఆరోజే రోహిత్‌, కోహ్లి టీ20 భవితవ్యం తేలేది! ఇప్పుడు కాకుంటే..

 
Advertisement
 
Advertisement