రన్నరప్‌ శ్రీరామ్‌ బాలాజీ జోడీ | Runner up is Sriram Balaji Jodi | Sakshi
Sakshi News home page

రన్నరప్‌ శ్రీరామ్‌ బాలాజీ జోడీ

Aug 19 2024 4:12 AM | Updated on Aug 19 2024 4:12 AM

Runner up is Sriram Balaji Jodi

ఈ ఏడాది రెండో ఏటీపీ చాలెంజర్‌ టూర్‌ డబుల్స్‌ టైటిల్‌ను సాధించాలని ఆశించిన భారత అగ్రశ్రేణి టెన్నిస్‌ ప్లేయర్‌ శ్రీరామ్‌ బాలాజీకి నిరాశ ఎదురైంది. డొమినికన్‌ రిపబ్లిక్‌లో జరిగిన సాంటో డొమింగో ఓపెన్‌ టోర్నీలో శ్రీరామ్‌ బాలాజీ (భారత్‌)–ఫెర్నాండో రొంబోలి (బ్రెజిల్‌) ద్వయం రన్నరప్‌గా నిలిచింది. 

2 గంటల 16 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో బాలాజీ–రొంబోలి జోడీ 7–6 (7/2), 4–6, 16–18తో హిడాల్గో–వరేలా (మెక్సికో) జంట చేతిలో ఓడిపోయింది. ఈ సీజన్‌లో బాలాజీ కాగ్లియారి ఓపెన్‌లో విజేతగా నిలిచి... పెరూగ్లా, బ్రాన్‌్చవీగ్‌ టోరీ్నల్లో రన్నరప్‌గా నిలిచాడు.   

Advertisement
 
Advertisement
Advertisement