
PC: Times Now
ఆసియాకప్-2022లో మరోసారి దాయాదుల పోరుకు రంగం సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్ సూపర్-4లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్-పాక్ జట్లు ఆదివారం తలపడనున్నాయి. ఇకఈ టోర్నీ లీగ్ మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓటమి పాలైన పాకిస్తాన్.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. మరో వైపు భారత్ మాత్రం దాయాది జట్టును మరోసారి మట్టికరిపించాలని ఉవ్విళ్లూరుతోంది.
ఇక ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఇప్పటికే పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ ఉన్న సంగతి తెలిసిందే.
ఇక ఓవరాల్‌గా( మెన్స్ అండ్ వుమెన్) అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ సుజీ బేట్స్ 3531 పరుగులతో తొలి స్థానంలో ఉంది. ఈ జాబితాలో రోహిత్ శర్మ 3520 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ మరో 12 పరుగులు సాధిస్తే బేట్స్‌ను ఆధిగమించి తొలి స్థానానికి చేరుకుంటాడు.
చదవండి: IND Vs PAK Super-4: 'టీమిండియా 36 ఆలౌట్'.. భయ్యా మీకు అంత సీన్ లేదు!