Asia Cup 2022: పెళ్లి చేసుకో బాబర్.. లేదు రోహిత్ భయ్యా.. ఇప్పుడే వద్దు!

ఆసియాకప్-2022లో దాయాదుల పోరుకు సమయం అసన్నమైంది. ఆదివారం దుబాయ్ వేదికగా భారత్-పాక్ జట్లు తాడోపేడో తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్‌కు ముందు ఇరు జట్లు ఐసీసీ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నాయి.
అయితే శుక్రవారం ప్రాక్టీస్ ముగిసిన అనంతరం భారత్-పాక్ సారథిలు రోహిత్ శర్మ, బాబర్ ఆజం ఒకరి ఒకరు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య జరిగిన ఓ సరదా సంభాషణకు సంబంధించిన వీడియోను పీసీబీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇందులో రోహిత్ బాబర్‌ను పెళ్లి చేసుకో అని అడగగా.. దానికి ఆజం నవ్వుతూ ఇప్పుడే వద్దు భయ్యా అని బదులు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ తర్వాత ఇరు జట్లు తొలి సారి తలపడనున్నాయి.
©️ meets ©️#AsiaCup2022 pic.twitter.com/OgnJZpM9B1
— Pakistan Cricket (@TheRealPCB) August 27, 2022
చదవండి: Ind Vs Pak: కోహ్లికి గంగూలీ పరోక్ష హెచ్చరిక?! సెంచరీ చేయాలని ఆశిస్తున్నా.. కానీ ఇప్పుడు కష్టమే!
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు