అంపైర్‌తో వాగ్వాదం.. సహనం కోల్పోయిన పంత్‌ | Rishabh Pant throws ball in anger after umpire declines ball change request | Sakshi
Sakshi News home page

అంపైర్‌తో వాగ్వాదం.. సహనం కోల్పోయిన పంత్‌.. భారీ జరిమానా?

Jun 22 2025 8:18 PM | Updated on Jun 22 2025 8:18 PM

Rishabh Pant throws ball in anger after umpire declines ball change request

లీడ్స్‌:  భారత్‌ -ఇంగ్లండ్‌ల మధ్య లీడ్స్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో రిషభ్‌ పంత్‌ సహనం కోల్పోయాడు.  ఆదివారం మూడో రోజు ఆటలో భాగంగా తొలి సెషన్‌లో  భారత వైస్‌ కెప్టెన్‌ పంత్‌ కాస్త దూకుడుగా వ్యవహరించాడు. అంపైర్‌ పాల్‌ రఫెల్‌ వద్దకు వెళ్లి బాల్‌ను మార్చాలంటూ విజ్ఞప్తి చేశాడు. ఈ క్రమంలో బాల్‌ను పట్టుకుని చూసిన అంపైర్‌ రఫెల్‌.. అవసరం లేదు అంటూ అదే బాల్‌ను తిరిగి పంత్‌కు చేతికిచ్చాడు. 

దాంతో అసంతృప్తి చెందిన పంత్‌.. అదే బాల్‌తో నేలకేసి కొట్టాడు. ఇది 63 ఓవర్‌లో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ క్రీజ్‌లో ఉన్న సమయంలో జరిగింది. పంత్‌ ఇలా ప్రవర్తించడం ఐసీసీ క్రమశిక్షణా చర్యలు ఉల్లంఘన చర్యలు కిందకు రావడంతో భారీ జరిమానా విధించే అవకాశం ఉంది.  ఇది ఐసీసీ నియమావళికి విరుద్ధం కావడంతో పంత్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.  

 

 కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 471 పరుగులకు ఆలౌట్‌ కాగా, ఇంగ్లండ్‌ కూడా అంతే ధీటుగా బదులిస్తోంది. ఇంగ్లండ్‌ తన తొలి ఇన్నింగ్స్‌ లో భాగంగా  ఓలీ పోప్‌)106) సెంచరీ చేయగా, హారీ బ్రూక్ 99 పరుగుల వద్ద పెవిలియన్‌ చేరాడు.  

 

 

Advertisement
 
Advertisement
Advertisement