ఐపీఎల్-2025 మెగా వేలం భారత క్రికెటర్లను ఓవర్‌నైట్‌లో కోటీశ్వరులగా మార్చేసింది. ఇటీవల జెడ్డా వేదికగా జరిగిన ఈ క్యాష్‌రిచ్ మెగా వేలంలో టీమిండియా క్రికెటర్లపై కాసుల వర్షం కురిసింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ రూ. 27 కోట్లకు అమ్ముడుపోయి ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.
ఈ వేలంలో రిషబ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. పంత్ తర్వాత అత్యంత ఎక్కువ ధర పలికిన ఆటగాళ్లగా శ్రేయస్ అయ్యర్(రూ. 26.75 కోట్లు), వెంకటేష్ అయ్యర్(రూ.23.75) నిలిచారు. మరోవైపు రిటెన్షన్ జాబితాలో అత్యధిక ధర దక్కించుకున్న భారత ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. అతడిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 21 కోట్లకు రిటైన్ చేసుకుంది.
కోహ్లిని దాటేసిన పంత్..
అయితే ఆటగాళ్ల ఐపీఎల్ జీతాలు ఖారారు కావడంతో రిషబ్ పంత్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. క్రికెట్ ఒప్పందాల ద్వారా అత్యధికంగా సంపాదిస్తున్న భారత ఆటగాడిగా పంత్ నిలిచాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లిని పంత్ అధిగమించాడు.
ఇండియన్ ప్లేయర్లకు బీసీసీఐ, ఐపీఎల్ కాంట్రాక్ట్‌ల ద్వారా వార్షిక అదాయం లభిస్తోంది. పంత్ క్రికెట్ కమిట్‌మెంట్‌లతో ఇప్పుడు ఏడాదికి రూ. 32 కోట్లు అందుకోన్నాడు. పంత్ ప్రస్తుతం బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఎ కేటగిరీలో ఉన్నాడు.
బీసీసీఐ కాంట్రాక్ట్ ద్వారా రిషబ్ ఏడాదికి రూ. 5 కోట్లు అందుకుంటున్నాడు. అదేవిధంగా ఈ ఏడాది నుంచి అతడికి ఐపీఎల్ కాంట్రక్ట్ ద్వారా రూ.27 కోట్లు లభించనున్నాయి. మొత్తంగా ఏడాదికి రూ. 32 కోట్లను ఈ ఢిల్లీ చిచ్చరపిడుగు అందుకోనున్నాడు.
మరోవైపు విరాట్ కోహ్లి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఎ ప్లస్ కేటగిరీలో ఉన్నాడు. బీసీసీఐ కాంట్రాక్ట్ వల్ల కోహ్లికి ఏడాదికి రూ. 7 కోట్లు అందుతున్నాయి. ఐపీఎల్‌లో ఆర్సీబీ రిటెన్షన్‌తోతో కోహ్లికి రూ. 21 కోట్లు అందనున్నాయి. మొత్తంగా కోహ్లి ఏడాదికి రూ.28 కోట్లు తీసుకుంటున్నాడు. అంటే పంత్ కంటే రూ. 4 కోట్లు కోహ్లి వెనకబడి ఉన్నాడు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment