Rishabh Pant Likely To Return To Indian Squad For England Series In 2024: Report - Sakshi
Sakshi News home page

రిషబ్‌ పంత్‌ రీఎంట్రీకి ముహూర్తం ఖరారు..?

Aug 15 2023 7:24 PM | Updated on Aug 16 2023 2:22 PM

Rishabh Pant Likely To Return To Indian Squad For England Series In 2024 Says Report - Sakshi

స్వాతంత్ర్య దినోత్సవం నాడు భారత క్రికెట్‌ అభిమానులకు శుభవార్త అందింది. గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడిన స్టార్‌ క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ త్వరలోనే బరిలోకి దిగనున్నాడని సోషల్‌మీడియా కోడై కూస్తుంది. పంత్‌ రీఎంట్రీకి ముహూర్తం కూడా ఖరారైందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. వచ్చే ఏడాది (2024) జనవరిలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్‌ సిరీస్‌ సమయానికంతా పంత్‌ ఫిట్‌గా ఉంటాడని తెలుస్తుంది. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన ఓ కీలక అధికారి సైతం ధృవీకరించినట్లు ఓ ప్రముఖ క్రికెట్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది.

కాగా, గతేడాది డిసెంబర్‌ 30న ఘోర రోడ్డు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన పంత్‌.. ప్రస్తుతం 70 శాతం వరకు కోలుకుని, ఫిట్‌నెస్‌ కోసం నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో చమటోడుస్తున్నాడు. ప్రాక్టీస్‌ ఇంకా ప్రారంభించని పంత్‌ జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు. పంత్‌ వేగంగా కోలుకునే విధానం చూస్తుంటే అనుకున్న సమయానికంటే ముందే జట్టుతో చేరతాడని అభిమానులు అనుకుంటున్నారు. 

మరోవైపు గాయం కారణంగా చాలాకాలంగా జట్టుకు దూరంగా ఉండిన టీమిండియా స్పీడ్‌స్టర్‌ జస్ప్రీత్‌ బుమ్రా త్వరలో జరుగనున్న ఐర్లాండ్‌ సిరీస్‌తో క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సిరీస్‌లో బుమ్రా టీమిండియాకు నాయకత్వం వహించనున్నాడు. మరోపక్క గాయాల బారిన పడి శస్త్ర చికిత్సలు చేయించుకున్న కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌లు సైతం వేగంగా కోలుకుంటున్నారు. వీరిద్దరు నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో ప్రాక్టీస్‌ కూడా మొదలుపెట్టారు. ఆసియా కప్‌ నాటికి వీరిద్దరు పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించేందుకు కఠోరంగా శ్రమిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement