T20 World Cup 2022: Rishabh Pant, Axar Patel Set To Come India Playing XI - Sakshi
Sakshi News home page

T20 WC 2022: బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్‌.. టీమిండియాలో మూడు మార్పులు!

Nov 1 2022 11:16 AM | Updated on Nov 1 2022 12:19 PM

Rishabh Pant, Axar Patel set to come India Playing XI  - Sakshi

దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిపాలైన టీమిండియా.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. టీ20 ప్రపంచకప్‌(సూపర్‌-12)లో భాగంగా బుధవారం(నవంబర్‌2)న ఆడిలైడ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధిస్తే తమ సెమీస్‌ అవకాశాలను మరింత పదిలం చేసుకుంటుంది. మరోవైపు బంగ్లాదేశ్‌కు కూడా ఈ మ్యాచ్‌ చాలా కీలకం. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉంది.

టీమిండియాలో మూడు మార్పులు
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు దూరమైన అక్షర్‌ పటేల్‌ తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో  దినేష్‌ కార్తీక్‌ గాయం బారిన పడ్డాడు. దీంతో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు అతడి స్థానంలో పంత్‌ రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

మరో వైపు ఆడిలైడ్‌ పిచ్‌ ఫాస్ట్‌ బౌలర్లకు అనుకూలిస్తుంది కాబట్టి అదనపు పేసర్‌తో భారత్‌ బరిలోకి దిగాలని భావిస్తోంది. ఈ క్రమంలో అశ్విన్‌ స్థానంలో పేసర్‌ హర్షల్‌ పటేల్‌ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్‌ ఉంది. ఇక దక్షిణాఫ్రికాతో ఆడిన దీపక్‌ హుడా బెంచ్‌కే పరిమితం కానున్నాడు.

భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్‌), కేఎల్ రాహుల్, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షల్‌ పటేల్‌, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్‌ సింగ్‌, భువనేశ్వర్ కుమార్


చదవండి: T20 WC 2022: భారత్‌- బంగ్లాదేశ్‌ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. ఆట రద్దు అయితే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement