ఐపీఎల్‌లో గత ఏడాది ఆర్‌సీబీ విజేతగా నిలిచిన తర్వాత జరిగిన విజయోత్సవంలో 11 మంది అభిమానులు మృతి చెందారు. వారి స్మారకార్థం ఆర్‌సీబీ యాజమాన్యం భిన్న రీతిలో నివాళి అర్పించనుంది. ఇకపై చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లలో 11 సీట్లను ఖాళీగా ఉంచనుంది.
పీ1 స్టాండ్‌లోని ఈ సీట్లలో ఎవరూ కూర్చోకుండా ఆ 11 మంది జ్ఞాపకార్ధం శాశ్వతంగా అలాగే ఉంచనుంది. ‘జట్టుతో వారికి ఉన్న అనుబంధానికి ఇవి గుర్తుగా ఉండిపోతాయి. వారు ఎప్పటికీ ఆర్‌సీబీ అభిమానులే’ అని తమ గౌరవాన్ని ప్రకటించింది.


