అశ్విన్‌ టాప్‌ ర్యాంక్‌ పదిలం

Ravichandran Ashwin is number one in Test bowling rankings - Sakshi

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) టెస్టు బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తన నంబర్‌వన్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో అశ్విన్‌ మొత్తం ఆరు వికెట్లు పడగొట్టాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో అశ్విన్‌ 853 రేటింగ్‌ పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.

దక్షిణాఫ్రికా పేస్‌ బౌలర్‌ కగిసో రబడ ఒక స్థానం పురోగతి సాధించి 851 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకున్నాడు. భారత పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా కూడా ఒక స్థానం మెరుగుపర్చుకొని 825 పాయింట్లతో నాలుగో ర్యాంక్‌లో నిలువగా... స్పిన్నర్‌ రవీంద్ర జడేజా 754 పాయింట్లతో ఆరో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు.

టెస్టు బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత కెపె్టన్‌ రోహిత్‌ శర్మ ఒక స్థానం పడిపోయి 729 పాయింట్లతో 12వ ర్యాంక్‌లో నిలిచాడు. టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అశ్విన్, రవీంద్ర జడేజా తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.   

whatsapp channel

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top